IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ఆద్యంతం ఉత్కంఠగా కొనసాగుతోంది. ప్రతి మ్యాచ్ నువ్వానేనా అన్నట్టు జరుగుతున్న నేపథ్యంలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానం మారుతూ వస్తోంది. నిన్నటి వరకూ సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) టాప్‌లో ఉండగా.. వరుసగా రెండు విజయాలు సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) అగ్ర పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక ఉప్పల్ స్టేడియంలో భారీ విక్టరీ కొట్టిన లక్నో సూపర్ జెయింట్స్(LSG) 2 పాయింట్లు, +0.963 నెట్ రన్‌రేటుతో రెండో స్థానం దక్కించుకుంది.
తమ తొలి పోరులో గుజరాత్ టైటన్స్‌కు షాకిచ్చిన పంజాబ్ కింగ్స్ +0.550 నెట్ రన్‌రేటుతో మూడో ప్లేస్‌లో నిలిచింది. అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) నాలుగు, కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ బోణీ కొట్టని మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) -1.882 నెట్ రన్‌రేటుతో అట్టడుగున ఉంది. గుజరాత్ 8వ, ముంబై 9వ స్థానంలో ఉన్నాయి.
18వ సీజన్ మొదలై వారం రోజులు దాటింది. ఉత్కంఠ పోరాటాలు, ఆఖరి ఓవర్ థ్లిల్లర్స్ అభిమానులను అలరిస్తున్నాయి. సన్‌రైజర్స్ జట్టు రాజస్థాన్‌పై 286 పరుగులతో రెండో అత్యధిక స్కోర్ నమోదు చేయగా.. తొలి టైటిల్ వేటలో ఉన్న ఆర్సీబీ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఓపెనింగ్ సెరమొనీ అనంతరం ఈడెన్ గార్డెన్స్‌లో మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)కు 7 వికెట్ల తేడాతో చెక్ పెట్టిన బెంగళూరు.. రెండో మ్యాచ్‌లోనూ విజయగర్జన చేసింది.
RCB AT THE TOP OF THE POINTS TABLE IN IPL 2025 🔥 pic.twitter.com/Uce2JWMT5v
— Johns. (@CricCrazyJohns) March 28, 2025
చెన్నై సూపర్ కింగ్స్ కంచుకోట చెపాక్ మైదానంలో 17 ఏళ్ల పరాజయ ప్రస్థానానికి చరమగీతం పాడింది. ఉత్కంఠ పోరులో జోష్ హేజిల్‌వుడ్ (3-21) సూపర్ కింగ్స్ లైనప్‌ను కుప్పకూల్చగా.. ఆర్సీబీ 50 పరుగుల తేడాతో గెలుపొందింది. మిగతా జట్ల విషయానికొస్తే.. హైదరాబాద్, లక్నో జట్లు.. చెరొక మ్యాచ్‌లో విజయం సాధించాయి. మెగా టోర్నీలో బోణీ చేయని గుజరాత్, ముంబై జట్లు అహ్మదాబాద్‌లో శనివారం తలపడుతున్నాయి. వీటిలో గెలుపొందిన జట్టు.. తమ రెండు పాయింట్లతో తమ స్థానాన్ని మెరుగుపరచుకునే అవకాశముంది.
✌ in ✌ for @RCBTweets 🥳
Plenty to celebrate for Royal Challengers Bengaluru as they beat #CSK and add 2️⃣ more points to their account! 🙌🙌
Scorecard ▶ https://t.co/I7maHMwxDS #TATAIPL | #CSKvRCB pic.twitter.com/WnXJJhTuVM
— IndianPremierLeague (@IPL) March 28, 2025