చండూరు, మార్చి 29 : కాలికి గాయమై చికిత్స అనంతరం హైదరాబాద్ సరూర్‌నగర్‌లో గల ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పల్లె రవికుమార్ గౌడ్‌ను సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ నెలికంటి సత్యం యాదవ్ శనివారం పరామర్శించారు. ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుని త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.
రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె వినయ్ కుమార్, బీఆర్ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ చెరుకు లింగంగౌడ్, బీఆర్ఎస్ నాయకులు రావుల వెంకటేశ్‌గౌడ్, లవ్‌కుమార్, ఈదులకంటి సంపత్‌కుమార్ పరామర్శించిన వారిలో ఉన్నారు.