బంజారాహిల్స్, ఫిబ్రవరి 26: జూబ్లీహిల్స్ రోడ్ నం.36లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్నది. గురువారం ఉదయం మంగళగౌరీ వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగి.. మొత్తం కాలిపోయింది. అయితే అక్కడ ఉన్న కొంతమంది సకాలంలో బయటకు ప రుగులు తీసి ప్రాణాలు దిక్కించుకున్నారు. వివరాల్లో కి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నం.36 ప్రధాన రహదారిపై సుమారు నాలుగేళ్ల క్రితం నిర్మించిన జీ ప్లస్ 4 భవనంలో మంగళగౌరి పేరుతో పట్టు చీరల షోరూమ్ ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకోకుండా రెండేళ్ల క్రితం అదనంగా ఐదో అంతస్తు సైతం నిర్మించారు.
షోరూమ్‌కు ఎలివేషన్‌గా భారీ ఆలయ గోపురం నమూనాను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, బోర్డు, చెక్క, తదితర వస్తువులతో నిర్మించారు. కాగా ఇటీవల షోరూమ్‌ను ఖాళీ చేయ గా మరో సంస్థకు అద్దెకు ఇచ్చారు. దీనికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో భవనంలో ఎలక్ట్రికల్, వెల్డింగ్ పనులు జరుగుతుండగా నిప్పురవ్వలు ఎగిసి పడడంతో మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలో నాలుగు ఫ్లోర్ల మేర మంట లు వ్యాపించడంతో పాటు బయటివైపు ఉన్న గోపు రం నమూనాతో సహా మొత్తం భవనం కాలిబూడిదయ్యింది. కాగా మంటలు చెలరేగడంతో పైన ఉన్న ఐదారు మంది టెక్నీషియన్లు కిందకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకోగా, సెల్లార్లో సివిల్ వర్క్స్ చేస్తున్న మరో నలుగురు కూలీలు అతి కష్టమ్మీద బ యటపడ్డారు.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నా రు. సుమారు గంటన్నర పాటు శ్రమించిన ఫైర్ , డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనపై సమాచారం అందుకున్న ట్రాఫిక్ డీసీపీ కాజల్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్, బంజారాహిల్స్ ఏసీపీ సామల వెంకట్‌రెడ్డి, అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్య లను పర్యవేక్షించారు. విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఘటనా స్థ లానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. కాగా.. మంటలు ఆర్పేక్రమంలో ఫైర్ సిబ్బందికి సెట్‌బ్యాక్ స్థలంలో అక్రమ నిర్మాణాలు తీవ్ర అడ్డంకిగా మారాయి. దీంతో మంటలను నియంత్రించడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది.