సిటీబ్యూరో: ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్ చూసి అమెజాన్ డెలివరీ హబ్ పార్టనర్ ఫ్రాంచైజ్ కోసం ప్రయత్నించిన ఓ న్యాయవాదికి సైబర్‌నేరగాళ్లు రూ. 2.87 లక్షలు టోకరా వేశారు. రాంపల్లికి చెందిన బాధితుడు ఇన్స్టాగ్రామ్ బ్రౌజ్ చేస్తుండగా అమెజాన్‌కు సంబంధించిన ప్రకటన చూశాడు. అమెజాన్ హబ్ పార్టనర్ ఫ్రాంచైజ్ కోసం ఆ ప్రకటనను క్లిక్ చేయడంతో వివరాలు పొందుపరుచాలంటూ సూచనలు చేశారు. అమెజాన్ ముంబై ఆఫీస్ నుంచి హర్షవర్ధన్‌ను మాట్లాడుతున్నానని, మీ వివరాలు మాకు చేరాయని మాట్లాడాడు. రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని, మొదటగా రూ.17,700 చెల్లించడంతో అమెజాన్‌కు ఆ డబ్బు చెల్లించినట్లు ఒక సాఫ్ట్‌కాపీ పంపించారు. తిరిగి లలిత అనే పేరుతో మరో మహిళ అమెజాన్ నుంచి మాట్లాడుతున్నట్లు ఫోన్‌చేసి మీ దరఖాస్తు ప్రాసెసింగ్‌లో ఉందని అగ్రిమెంట్ , సెక్యూరిటీ డిపాజిట్ తదితర ఫీజులు చెల్లించాలంటూ రూ. 2.87 లక్షలు వసూలు చేశారు. ఆ తరువాత ఫోన్లు లిఫ్ట్చేయడం మానేశారు. బాధితుడు మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.