అమరావతి : ఆంధ్రప్రదేశ్ మండలి( AP Council ) డిప్యూటీ చైర్మన్ ( Deputy Chairman) గా వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు ( Madhava Rao ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలిలో టీడీపీ, బీజేపీ, జనసేన సభ్యుల కంటే వైసీపీ సభ్యులు మెజార్టీ సంఖ్యలో ఉండడంతో కూటమి తరుఫున ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో బుధవారం మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు.
అనంతరం మాధవరావును చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టి అభినందించారు. ఈ కార్యక్రమానికి కూటమి సభ్యులు చైర్మన్ సీటు వద్దకు రాకపోవడంతో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. కూటమి సభ్యులు సభా సంప్రదాయాలను పాటించడం లేదని ఆరోపించారు. చైర్ పట్ల అగౌరవంగా వ్యవహరించడం మంచిది కాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటములు సహజమని, సభా సాంపరదాయాలు, గౌరవాలు శాశ్వతం అని అన్నారు.