లచ్చమ్మ మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
PUTTA MADHU | కమాన్ పూర్, మార్చి 29: ఓ వృద్ధురాలు తన అభిమానాన్నిచాటుకుంది. తుది శ్వాస విడిచే సమయంలోనూ తన అభిమాన నాయకుని గురించే మాట్లాడుతూ కన్నుమూసిన సంఘటన కమాన్‌పూర్ మండలంలో చోటు చేసుకుంది.
కమాన్ పూర్ మండలం పెంచికల్ పేట్ గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అభిమాని పెద్దవ్వ కుంభం లచ్చమ్మ అనే వృధ్దురాలు మృతి చెందగా ఆమె అంతిమయాత్రలో మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. లచ్చమ్మ పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించిన పుట్ట మధూకర్ ఆమె అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు. అయితే లచ్చమ్మ పుట్ట మధూకర్‌కు పెద్ద అభిమాని.
పెంచికల్పేటకు ఎప్పుడు వెళ్లినా లచ్చమ్మను కలిసి ఆమె యోగక్షేమాలు తెలుసుకునే వారు. అయితే అనారోగ్యంతోమంచంపట్టిన లచ్చమ్మ తుదిశ్యాస విడిచే సమయంలోనే మధన్నబిడ్డా అంటూ కలవరిస్తూ కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తన అభిమాని మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ భావోద్వానికి గురయ్యారు.