IPL Retention : ఐపీఎల్ చరిత్రలో మూడుసార్లు ఫైనల్ చేరినా కప్ కొట్టని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) స్క్వాడ్‌ను పూర్తిగా మార్చేందుకు సిద్ధమైంది. 17 సీజన్లుగా ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న ఆర్సీబీ తమ బృందంలో కేవలం ముగ్గురినే ఉంచుకుంది. వేటు పడింది. అన్క్యాప్డ్ ప్లేయర్‌గా.. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్ రిషభ్ పంత్‌ను వదిలేసింది. అనుకున్నట్టే లక్నోను కేఎల్ రాహుల్ వీడాడు. కోల్‌కతాను మూడోసారి చాంపియన్‌గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ సైతం జట్టు నుంచి బయటకొచ్చేశాడు.
సీజన్ ఆరంభం నుంచి జట్టుతో కొనసాగుతున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి రూ.21 కోట్లు చెల్లించేందుకు ఆర్సీబీ సిద్ధమైంది. మిడిలార్డర్లో దంచికొట్టే రజత్ పాటిదార్‌ను రూ. 11 కోట్లకు, యువపేసర్ యశ్ దయాల్‌ను రూ. 5 కోట్లకురిటైన్ చేసుకుంది.
Retentions done right! Fair value to the retained players and a huge purse to help us build a formidable squad. 🤝
Virat Kohli: 2️⃣1️⃣Cr
Rajat Patidar: 1️⃣1️⃣Cr
Yash Dayal: 5️⃣CrPurse Remaining: 8️⃣3️⃣Cr#PlayBold #ನಮ್ಮRCB #IPLRetention #IPL2025 pic.twitter.com/LvOi5zVxqf
— Royal Challengers Bengaluru (@RCBTweets) October 31, 2024
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కెప్టెన్ రిషభ్ పంత్‌ను వదిలేయగా.. లక్నో సూపర్ జెయింట్స్ కేఎల్ రాహుల్‌ను వద్దనుకుంది. అక్ష ర్ పటేల్‌ను రూ.16.5 కోట్లకు అట్టి పెట్టుకుంది. స్టార్ స్పిన్ర్ కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్‌లను అట్టిపెట్టుకుంది. లక్నో విషయానికొస్తే.. పూరన్‌కు రూ.21 కోట్లు, బిష్ణోయ్, మయాంక్‌లకు తలా రూ.11 కోట్లు చెల్లించనుంది.