IPL Retention : ఇండియన్ ప్రీమియర్ లీగ్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. 18 వ సీజన్ కోసం అట్టిపెట్టుకుంటున్న ఆరుగురు క్రికెటర్ల పేర్లను ఫ్రాంచైజీలు వెల్లడించాయి. గురువారంసాయత్రం గడువుముగిసే సమయానికి 10 ఫ్రాంచైజీలు తమ జాబితాను ఇచ్చేశాయి. ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తమ రిటైన్ ఆటగాళ్ల పేర్లను చెప్పింది. అందరూ ఊహించినట్టే జస్ప్రీత్ బుమ్రాను ముంబై రూ.18 కోట్లకు రిటైన్ చేసుకుంది.
మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్‌లను తలా రూ.16 కోట్లు ఇచ్చేందుకు సిద్దమైంది. యువకెరటం తిలక్ వర్మను రూ.8 కోట్లకు ముంబై అట్టిపెట్టకుంది. 17 సీజన్లుగా ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కేవలం ముగ్గురినే ఉంచుకుంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి రూ.21 కోట్లు చెల్లించేందుకు ఆర్సీబీ సిద్ధమైంది. మిడిలార్డర్లో దంచికొట్టే రజత్ పాటిదార్‌ను రూ. 11 కోట్లకు, యువపేసర్ యశ్ దయాల్‌ను రూ. 5 కోట్లకు రిటైన్ చేసుకుంది.