An Apple A Day | రోజూ ఒక యాపిల్ పండును తింటే అసలు ఏం జరుగుతుంది..?
మనకు తినేందుకు అనేక రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో యాపిల్ ప్రధానమైంది అని చెప్పవచ్చు. ఈ పండ్లను చాలా మంది రెగ్యులర్‌గా తినరు. కేవలం జ్వరం వచ్చినప్పుడు లేదా ఒంట్లో బాగాలేనప్పుడు అన్నం తినాలనిపించకపోతే అప్పుడు యాపిల్ పండ్లను తింటుంటారు.
An Apple A Day | మనకు తినేందుకు అనేక రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో యాపిల్ ప్రధానమైంది అని చెప్పవచ్చు. ఈ పండ్లను చాలా మంది రెగ్యులర్‌గా తినరు. కేవలం జ్వరం వచ్చినప్పుడు లేదా ఒంట్లో బాగాలేనప్పుడు అన్నం తినాలనిపించకపోతే అప్పుడు యాపిల్ పండ్లను తింటుంటారు. వాస్తవానికి యాపిల్ పండ్లను కేవలం అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే కాదు, ఇతర సమయాల్లోనూ తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రోజూ ఒక యాపిల్ పండును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వారు అంటున్నారు. యాపిల్ ను రోజుకొకటి తింటే అసలు ఏం జరుగుతుంది.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కంటి చూపు మెరుగు పడుతుంది..
రోజుకు ఒక యాపిల్ పండును తినడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. యాపిల్ పండ్లలో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. దీంతో కొన్ని రోజులకు కళ్లద్దాలను తీసి పడేస్తారు. అలాగే వయస్సు మీద పడడం వల్ల వచ్చే కళ్లలో శుక్లాలు అనే సమస్య రాకుండా చూసుకోవచ్చు. యాపిల్ పండును రోజుకు ఒకటి తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గి మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీంతో రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్ రాదు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కనుక రోజూ ఒక యాపిల్‌ను కచ్చితంగా తినాలి.
ఊపిరితిత్తులకు..
యాపిల్ పండ్లు మన ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. యాపిల్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులు డ్యామేజ్ అవకుండా చూస్తాయి. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయే కఫాన్ని కరిగిస్తాయి. దీంతోపాటు ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీని వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు రావు. అలాగే దగ్గు, జలుబు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.
జీర్ణవ్యవస్థకు..
యాపిల్ పండ్లలో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది ప్రీ బయోటిక్‌గా పనిచేస్తుంది. అందువల్ల జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బాక్టీరియా పెరుగుతుంది. దీంతో జీర్ణవ్యవస్థ పనితీరు సరిగ్గా ఉంటుంది. అలాగే మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడవచ్చు. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. రాత్రి పూట చక్కగా నిద్ర పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. రోజుకు ఒక యాపిల్‌ను తినడం వల్ల జ్ఞాపకశక్తి సైతం పెరుగుతుంది. దీంతో మెదడు యాక్టివ్‌గా ఉంటుంది.
యాపిల్ పండ్లను రోజూ తినడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. ముఖ్యంగా పొట్ట దగ్గర ఉండే కొవ్వు కరుగుతుంది. అలాగే గుండె జబ్బులు, డయాబెటిస్ రాకుండా యాపిల్ పండ్లు మనల్ని రక్షిస్తాయి. ఇన్ని లాభాలు ఉన్నాయి కనుక రోజుకు ఒక యాపిల్ పండును తినడం మరిచిపోకండి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- apples
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

