South Africa vs India : సుదీర్ఘ ఫార్మాట్లో బంగ్లాదేశ్‌ను వైట్‌వాష్ చేసిన దక్షిణాఫ్రికా (South Africa) నవంబర్‌లో భారత జట్టుతో తలపడనుంది. స్వదేశంలో టీమిండియాతో సఫారీ జట్టు నాలుగు టీ20లు ఆడనుది. ఇప్పటికే బీసీసీఐ (BCCI) స్క్వాడ్‌ను ప్రకటించేసింది. ఈ నేపథ్యంలో పొట్టి సిరీస్ కోసం బోర్డు ఆ దేశ బోర్డు స్క్వాడ్‌ను ఎంపిక చేసింది.
ఎడెన్ మర్క్రమ్ సారథిగా 16 మందితో కూడిన బృందాన్ని సెలెక్టర్లు ప్రకటించారు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన స్టబ్స్, మిల్లర్, క్లాసెన్‌లతో పాటు స్పిన్నర్ కేశవ్ మహరాజ్ స్క్వాడ్‌లో ఉన్నారు. అయితే.. మిస్టరీ స్పిన్నర్ తబ్రేజ్ షంసీ, పేసర్ అన్రిచ్ నోర్జిలకు దక్షిణాఫ్రికా సెలెక్టర్లు షాకిచ్చారు. ఈ ఇద్దరూ సెంట్రల్ కాంట్రాక్ట్ తమకు వద్దని చెప్పడంతో టీ20 సిరీస్‌కు వీళ్లను పక్కనపెట్టేశారు.
▶️ Marco Jansen & Gerald Coetzee return to international cricket
▶️ No room for Anrich Nortje & Tabraiz Shamsi after they opted out of national contractsThe four-match series between the World Cup finalists kicks off in just over a weekhttps://t.co/pcm5lysLz6 | #SAvIND pic.twitter.com/1dzwCJHGhr
— ESPNcricinfo (@ESPNcricinfo) October 31, 2024
దక్షిణాఫ్రికా స్క్వాడ్ : ఎడెన్ మర్క్రమ్(కెప్టెన్), రీజా హెండ్రిక్స్, రియాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, డొనొవన్ ఫెరేరీ, ఆండిలే సిమెలమె, మిహ్లలీ పొంగ్వానా, మార్కొ జాన్సెన్, పాట్రిక్ క్రుగెర్, కాబా పీటర్, గెరాల్డ్ కొయెట్జ్, ఒట్నెల్ బార్ట్‌మన్, లుథో సిపమ్లా, కేశవ్ మహరాజ్.
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ అనంతరం భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. సూర్యకుమార్ యాదవ్ సారథిగా టీమిండియా అక్కడ 4 టీ20లు ఆడనుంది. ఇరుజట్ల మధ్య నవంబర్ 8వ తేదీన తొలి మ్యాచ్‌తో టీ20 సిరీస్ మొదలవ్వనుంది. అనంతరం నవంబర్ 10న రెండో మ్యాచ్, నవంబర్ 13న మూడో టీ20, నవంబర్ 15న చివరి టీ20 మ్యాచ్ జరుగనుంది.