BAN vs SA 2nd Test : మిర్పూర్ టెస్టులో గెలుపొంది చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా (South Africa) రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ఇన్నింగ్స్ 273 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి సిరీస్ కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో కగిసో రబడ(5/37) విజృంభణతో 159 పరుగులకే కుప్పకూలిన బంగ్లాను స్పిన్నర్లు దెబ్బకొట్టారు. కేశవ్ మహరాజ్(5/59), సెనురన్ ముత్తుస్వామి(4/45)లు వరుసగా వికెట్లు తీస్తూ ఆతిథ్య జట్టు బ్యాటర్లను వణికించారు. ఈ స్పిన్ ద్వయం 9 వికెట్లు తీయడంతో సఫారీలు భారీ తేడాతో గెలిచి ఆసియా గడ్డపై 12 ఏండ్ల తర్వాత టెస్టు సిరీస్ ముద్దాడింది.
ఛత్తోగ్రామ్ స్టేడియంలో దంచికొట్టిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు జట్టుకు కొండంత స్కోర్ అందించారు. దాంతో, తొలి ఇన్నింగ్స్‌ను 576 వద్ద డిక్లేర్ చేసిన సఫారీ జట్టు అనంతరం బంగ్లాదేశ్‌ను ఆలౌట్ చేసింది. పేసర్ కగిసో రబడ(5/37) నిప్పులు చెరగడంతో ఆతిథ్య బంగ్లా 159 పరుగులకే కుప్పకూలింది. మొమినుల్ హక్(82) ఒంటరి పోరాటం చేసిన ఫాలో ఆన్ తప్పించలేకపోయాడు.
A thoroughly dominant display! South Africa take the series 2-0, sweeping Bangladesh at home 💪
Live: https://t.co/6rBmQz3maV | #BANvSA pic.twitter.com/Uga6PgN8jv
— ESPNcricinfo (@ESPNcricinfo) October 31, 2024
రెండో ఇన్నింగ్స్‌లో కేశవ్ మహరాజ్(5/59), సెనురన్ ముత్తుస్వామి(4/45)లు పోటాపోటీగా వికెట్లు తీశారు. బంగ్లా బ్యాటర్లను కట్టడి చేస్తూ వికెట్ల వేట కొనసాగించారు. ఓపెనర్ మహ్ముద్లా హసన్ జాయ్(11)ను ఔట్ చేసి తొలి వికెట్ సాధించిన సెనురన్ కాసేపటికే జకీర్ హసన్(7)ను బోల్తా కొట్టించాడు. డేంజరస్ మొమినుల్ హక్(0), మెహిదీ హసన్ మిరాజ్(6)లను ఔట్ చేసిన మహరాజ్ బంగ్లాను ఓటమి అంచుల్లోకి నెట్టాడు. 10వ బ్యాటర్‌గా వచ్చిన నిహద్ రానా(0)ను మహరాజ్ ఔట్ చేయడంలో బంగ్లా 143 పరుగులకే ఆలౌటయ్యింది.
No arrest in the slide, SA three away! https://t.co/zHzpPCLSzg
— ESPNcricinfo (@ESPNcricinfo) October 31, 2024
తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు రెచ్చిపోయారు. ఏకంగా ముగ్గురు సెంచరీలతో విజృంభించారు. ఓపెనర్ టోనీ డి జొర్జి(177), ట్రిస్టన్ స్లబ్స్(100)లు బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ వంద కొట్టేశారు. ఇక రెండో రోజు తన వంతు అన్నట్టు వియాన్ మల్డర్(105) సెంచరీతో గర్జించాడు. దాంతో, దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎడెన్ మర్క్రమ్ జట్టు స్కోర్ 576-6 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు.