WPL 2025 : మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మూడో సీజన్ సన్నద్ధతను మొదలెట్టేసింది. డిఫెండింగ్ చాంపియన్‌గా ఆడనున్న ఆర్సీబీ కీలక ప్లేయర్‌ను తీసుకుంది. ఇంగ్లండ్ ఓపెనర్ డానీ వ్యాట్ హొడ్గే (Danni Wyatt Hodge)ను యూపీ వారియర్స్ (UP Warriorz) నుంచి ట్రేడ్ పద్ధితిలో కొన్నది. గత సీజన్ మినీ వేలంలో వ్యాట్‌ను రూ.30 లక్షలకు యూపీ దక్కించుకుంది.
అయితే.. ఆమెను ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. దాంతో, వ్యాట్‌ను వదిలించుకోవాలని నిర్ణయించుకున్న యూపీ వారియర్స్ ట్రేడ్ పద్దతిని ఆశ్రయించింది. ఈమధ్యే ముగిసిన మహిళల టీ20 వరల్డ్ కప్‌లో దంచికొట్టిన వ్యాట్‌ను తీసుకునేందుకు ఆర్సీబీ ముందుకొచ్చింది. దాంతో, ఎలాంటి అదనపు ఫీజులు లేకుండా తాము కొన్న ధరకే ఆమెను చాంపియన్ ఆర్సీబీకి అప్పగించేందుకు అంగీకరించింది. మూడో సీజన్లో బెంగళూరు తరఫున ఆడనున్న వ్యాట్ తన అరంగేట్రాన్ని ఘనంగా చాటాలనే పట్టుదలతో ఉంది.
🚨 NEWS 🚨
Danni Wyatt traded to Royal Challengers Bengaluru from UP Warriorz.
Details 🔽 #TATAWPL | @RCBTweets | @UPWarriorz https://t.co/ziXCNlHjSN
— Women’s Premier League (WPL) (@wplt20) October 30, 2024
‘వ్యాట్ ఒక గేమ్ చేంజర్. అంతేకాదు ఆమె మంచి అథ్లెట్. ఆమె సేవల్ని మేము ఉపయోగించుకుంటాం’ అని మంధాన చెప్పగా.. ‘ఏ జట్టుకు ఆడుతున్నాను అనేది పట్టించుకోను. అయితే.. ఆర్సీబీకి మద్దతిస్తా. ఎందుకుంటే.. క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, మోయిన్ అలీ, యజ్వేంద్ర చాహల్, ఏబీ డివిలియర్స్ వంటి ఆటగాళ్లు ఆ జట్టుకు ఆడారు. అందుకే నేను బెంగళూరుకు ఆడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’ అని వ్యాట్ వెల్లడించింది.
🌟 Celebrating a season of extraordinary moments and unparalleled teamwork!
We’re filled with gratitude for the incredible individuals who brought this vision to life. 🙌👏#TATAWPL | @JayShah
Relive the top moments: https://t.co/v1JsZm6wgb pic.twitter.com/zPuwMtbS9P
— Women’s Premier League (WPL) (@wplt20) March 21, 2024
టీ20 స్పెషలిస్ట్ అయిన వ్యాట్ ఇప్పటివరకూ 164 మ్యాచ్‌లు ఆడింది. రెండు శతకాలతో, 16 హాఫ్ సెంచరీలతో ఈ డాషింగ్ బ్యాటర్ 2,979 పరుగులు సాధించింది. ఇక వ్యాట్ ఆర్సీబీకీ రావడాన్ని కెప్టెన్ స్మృతి మంధాన స్వాగతించింది.డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ 2025 ఫిబ్రవరిలో మొదలవ్వనుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండించ్ చాంపియన్ ఆర్సీబీని రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ కొట్టనుంది.