కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని వాంకిడి మండల కేంద్రం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో (Tribal girl’s ashram) విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు (Food poison) గురయ్యారు. మధ్యాహ్నా భోజనం అనంతరం కడుపునొప్పితో వాంతులు, విరేచనాలు కావడంతో 30 మంది విద్యార్థినిలను ప్రభుత్వ ఆసుపత్రికి (Hospital) తరలించారు. చికిత్స అనంతరం 27 మంది విద్యార్థులు కోలుకోగా ఇద్దరు వాంకిడి, మరోకరు ఆసిఫాబాద్ ప్రభుత్వ దవాఖానాలో చికిత్స పొందుతున్నారు.
వంటగది, వంట సామగ్రి అపరిశుభ్రతతో పాటు, తాగునీరు కలుషితం కావడంతోనే అస్వస్థతకు గురైనట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. వాటర్ ట్యాంక్(Water Tank) ను నెలల తరబడి శుభ్రం చేయకుండా నీరు అందిస్తున్నారని అస్వస్థతకు గురైన విద్యార్థినిలు వాపోయారు.
ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్నా బయట రాకుండా సిబ్బంది జాగ్రత్తపడుతున్నారని ఆరోపణలున్నాయి. వార్డెన్ స్థానికంగా ఉండడం లేదని దీంతో హాస్టల్ పర్యవేక్షణ లేక విద్యార్థినిలు ఇబ్బందులు పడుతున్నారి స్థానికులు పేర్కొన్నారు.