Chia Seeds | చియా సీడ్స్‌ను సాధారణంగా సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు. ఎందుకంటే వీటిల్లో మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇక చియా సీడ్స్, సబ్జా విత్తనాలు చూసేందుకు ఒకేలా ఉంటాయి. కానీ ఇవి వేర్వేరు. చియా విత్తనాలను రోజూ తినడం వల్ల మనం అనేక లాభాలను పొందవచ్చు. చియా సీడ్స్‌ను తినడం వల్ల పొట్ట దగ్గరి కొవ్వు సులభంగా కరిగిపోతుంది. వీటిల్లో ఉండే అనేక పోషకాలు మనకు సంపూర్ణ పోషణను అందిస్తాయి. అందువల్ల బరువు తగ్గాలని చూస్తున్నవారు, వ్యాయామం చేసే వారు ఈ సీడ్స్‌ను తప్పనిసరిగా రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి.
చియా సీడ్స్‌లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ విత్తనాల్లో మన శరీరానికి కావల్సిన దాదాపు ముఖ్యమైన పోషకాలు అన్నీ ఉంటాయి. చియా సీడ్స్‌లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి అధిక బరువును తగ్గించేందుకు, బరువును నియంత్రించేందుకు సహాయం చేస్తాయి. చియా విత్తనాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక వీటిని తింటే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో అతిగా ఆహారం తీసుకోకుండా జాగ్రత్త పడవచ్చు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. చియా సీడ్స్‌లో మంచి మొత్తంలో ప్రోటీన్లు కూడా ఉంటాయి. ఇవి కండరాల నిర్మాణానికి, కండరాలను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయ పడతాయి. అలాగే బరువు తగ్గేందుకు కూడా సహాయం చేస్తాయి.
చియా విత్తనాల్లో వృక్ష సంబంధిత ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. దీని వల్ల శరీరంలోని వాపులు తగ్గుతాయి. అలాగే ఊబకాయం కూడా తగ్గుతుంది. మెటబాలిజం మెరుగు పడుతుంది. చియా సీడ్స్‌లో మంచి మొత్తంలో క్యాల్షియం, మెగ్నిషియం, ఐరన్ కూడా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. అధిక బరువు తగ్గేందుకు దోహదపడతాయి.
చియా సీడ్స్‌ను తినడం వల్ల బరువు తగ్గుతారు. అందువల్ల ఈ విత్తనాలను రోజు వారి ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిని తింటే పొట్ట దగ్గరి కొవ్వు సైతం కరిగి పొట్ట ఫ్లాట్‌గా మారుతుంది. ఈ విత్తనాల్లో ఉండే ఫైబర్ కొవ్వును కరిగిస్తుంది. 2 టేబుల్ స్పూన్ల చియా విత్తనాల్లో 10 గ్రాముల మేర ఫైబర్ ఉంటుంది. ఇది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో క్యాలరీలు ఉండే ఆహారాలను తీసుకోరు. ఫలితంగా బరువు తగ్గుతారు. చియా విత్తనాల్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది నీటిని శోషించుకుంటుంది. దీంతో జెల్ లాంటి పదార్థంగా ఈ విత్తనాలు మారుతాయి. ఫలితంగా జీర్ణక్రియ నెమ్మదిగా సాగుతుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ కూడా పెరగవు. అందువల్ల షుగర్ ఉన్నవారికి కూడా చియా విత్తనాలు అద్భుతమైన ఆహారం అని చెప్పవచ్చు.
చియా విత్తనాలను తినడం వల్ల ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. ఇవి అధిక బరువును తగ్గించేందుకు దోహద పడతాయి. ఈ సీడ్స్‌ను తింటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. పేగుల్లో మలం సులభంగా కదులుతుంది. దీంతో మలబద్దకం నుంచి బయట పడవచ్చు. రాత్రి పూట 1 టేబుల్ స్పూన్ చియా విత్తనాలను ఒక గ్లాస్ నీటిలో నానబెట్టాలి. దీంతో తెల్లారే సరికి అవి జెల్లాగా మారుతాయి. వాటిని పరగడుపునే తినాలి. లేదా బ్రేక్‌ఫాస్ట్‌తో కలిపి తినవచ్చు. దీని వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.