IPL 2025 : IPL 2025 : డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)కు బిగ్ షాక్.. ప్లే ఆఫ్స్ చేరాలనుకున్న ఆ జట్టు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. శనివారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru)తో జరగాల్సిన మ్యాచ్ రద్దు అయింది. వర్షం కారణంగా మ్యాచ్ నిర్వహణ అసాధ్యం కావడంతో ఇరుజట్లకు చెరొక పాయింట్ కేటాయించారు. దాంతో, ప్లే ఆఫ్స్ రేసు నుంచి అజింక్యా రహానే బృందం నిష్క్రమించగా.. ఆర్సీబీ మరో రెండు మ్యాచుల్లో ఒక్కటి గెలిచినా నాకౌట్‌కు దూసుకెళ్లుతుంది.
పదిరోజుల విరామం తర్వాత ఐపీఎల్ చూద్దామని ఆశపడిన అభిమానులకు నిరాశే మిగిలింది. చిన్నస్వామి స్టేడియంలో కుండపోత కారణంగా ఆర్సీబీ, కోల్‌కతా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణం అయింది. టాస్ సమయానికి ముందు నుంచే మొదలైన వర్షం.. రెండు గంటలకు పైగా కురుస్తూనే ఉంది. దాంతో, 10:23 గంటలకు పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు, మ్యాచ్ రిఫరీ కనీసం 5 ఓవర్లు ఆడించడం కూడా కుదరని తేల్చారు.
Bengaluru’s skies have the final say 😕 pic.twitter.com/BtABArQpZp
— ESPNcricinfo (@ESPNcricinfo) May 17, 2025
అనంతరం ఇరుజట్ల సారథులతో మాట్లాడి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. దాంతో, ఇరుజట్లకు ఒక్కో పాయింట్ వచ్చింది. అయితే.. ఈ మ్యాచ్‌పై భారీ ఆశలు పెట్టుకున్న కోల్‌కతా గుండె పగిలింది. 12 పాయింట్లతో ఆ జట్టు ఎలిమినేట్ అయింది. ఆర్సీబీకి ఇంకా రెండు మ్యాచ్‌లు ఉండడంతో.. వాటిలో ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్తు దక్కనుంది. రేపు జరుగబోయే డబుల్ హెడర్‌లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్లు ఓడిపోతే.. రజత్ పాటిదార్ బృందం నేరుగా ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది.