VPTL 2025 : ఐపీఎల్ రాకతో టీ20లకు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అంతర్జాతీయంగానే కాదు దేశవాళీలోనూ పొట్టి క్రికెట్ టోర్నీలు జోరందుకుంటున్నాయి. క్రికెట్‌ను అమితంగా ప్రేమించే భారత్‌లో ఈ ట్రెండ్ కొంచెం ఎక్కువ మరి. అవును.. విదర్భ క్రికెట్ అసోసియేషన్(VCA) సరికొత్తగా ప్రొ టీ20 లీగ్‌కు శ్రీకారం చుట్టింది. ఐపీఎల్ 18వ సీజన్ ఫైనల్ ముగియగానే ‘విదర్భ ప్రొ టీ20’ టోర్నమెంట్‌ను ఆరంభిస్తామని శనివారం వీసీఏ వెల్లడించింది. ఆరు జట్లు పోటీపడే ఈ లీగ్ మ్యాచ్‌లన్నింటినీ క్రికెట్ అసోసియేషన్ పరిధిలోని స్టేడియాల్లో నిర్వహిస్తామని తెలిపింది.
నాగ్‌పూర్ ప్రాంతంలో పొట్టి క్రికెట్‌కు ఆదరణ పెంచాలనే ఉద్దేశంతో విదర్భ క్రికెట్ అసోసియేషన్ ప్రొ టీ20 లీగ్‌ను ప్రారంభించనుంది. జూన్ 5వ తేదీ నుంచి 15 వరకూ ఈ మెగా టోర్నీ అభిమానులను అలరించనుంది. టైటిల్ కోసం ఆరు జట్లు పోటీ పడనున్నాయి. విశేషం ఏంటంటే.. మహిళలకు కూడా ఇందులో ప్రాతినిధ్యం లభించనుంది. పురుషుల విభాగంలో మూడు.. మహిళల విభాగంలో మూడు జట్లు బరిలోకి దిగుతాయని వీసీఏ తెలిపింది.
आली रे आली, आता विदर्भची बारी आली 🔥
The first-ever Vidarbha Pro T20 League is here. Where raw talent from the soil of Vidarbha will rise 🔥6 Men’s Teams | 3 Women’s Teams
Starting from 5th June, 2025 – 15th June, 2025 🥳
📍 VCA, Jamtha Stadium, Nagpur#VidarbhaProT20League pic.twitter.com/OG6etTsaOi— Vidarbha Pro T20 League (@vidarbhaprot20) May 17, 2025
‘విదర్బ టీ20 లీగ్ నిర్వహించాలనేది మా చిరకాల కోరిక. మా ప్రాంతంలోని యువతలో పోటీతత్వం పెంచాలని.. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వాళ్లకు గుర్తింపు రావాలనే ఆలోచనతో ఈ లీగ్‌ను ఆరంభిస్తున్నాం. స్థానికుల ప్రతిభను విశ్వమంతా చాటేలా ఈ లీగ్‌ను జరుపుతాం’ అని వీసీఏ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ ప్రశాంత్ వైద్య(Prashanth Vaidya) వెల్లడించాడు. ఈ మెగా టోర్నీకి విదర్భ స్టార్లు ఉమేశ్ యాదవ్ (Umesh Yadav), మహిళల జట్టు మాజీ క్రికెటర్ జులన్ గోస్వామి ప్రచారకర్తలుగా ఎంపికయ్యారు. సో.. ఐపీఎల్ ముగిసిందో లేదో.. విదర్భ ప్రొ టీ20 తొలి సీజన్‌కు తెర లేవనుందన్న మాట.