Krishi Sankalp Abhiyan | సైదాబాద్, మే 17: కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) అభివృద్ధి చేసిన కృషి సంకల్ప్ అభియాన్ దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని సెంట్రల్ డ్రైలాండ్ వ్యవసాయ పరిశోధన సంస్థ (క్రీడా) డైరెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సింగ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ నెల 29వ తేదీ నుంచి జూన్ 12 వరకు దేశవ్యాప్తంగా 700కి పైగా జిల్లాల్లో కొనసాగుతుందని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ, గ్రామీణ అభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో జరిగిన సమావేశంలో ప్రకటించారని ఆయన తెలిపారు.
వ్యవసాయ శాస్త్రవేత్తలు, మంత్రిత్వ శాఖ అధికారులు, ఉద్యోగులు, స్థానిక కార్మిక సంఘాలతో బృందాలుగా ఏర్పాటు చేసి ప్రతిరోజు వివిధ గ్రామాలను సందర్శిస్తారని ఆయన తెలిపారు. రైతులతో నేరుగా సంభాషించి వ్యవసాయం గురించి అవగాహన కల్పించి, తగిన సలహాలను ఇస్తారని అన్నారు. ప్రయోగశాల నుంచి భూమికి అనే మంత్రాన్ని సహకారం చేసుకునేందుకు జరుగుతున్న ఈ అభియాన్ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఆధునిక, ఆదర్శ వ్యవసాయంతో పాటు ఒక దేశం, ఒక వ్యవసాయం, ఒక బృందం అనే నినాదంతో దేశవ్యాప్తంగా 731 ఖుషి విజ్ఞాన కేంద్రాలు 100కు పైగా ఐసీఏఆర్ కేంద్రాలకు చెందిన అధికారులు పాల్గొంటారని ఆయన తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని రైతుల వద్దకు నేరుగా వెళ్లి క్షేత్రస్థాయిలో అధికారులు వివిధ అంశాలపై చర్చించి సలహాలు ఇస్తారని, రైతుల సందేహాలను పూర్తి చేస్తారని నివృత్తి చేస్తారని పేర్కొన్నారు.