Amaravathi ki Aahwanam | తెలుగు ప్రేక్షకులకు థ్రిల్లర్ జోనర్లో సరికొత్త ఫీల్ అందించేందుకు రెడీ అవుతోంది అమరావతికి ఆహ్వానం (Amaravathiki Aahwanam). ఎస్తర్ నోరోన్హా వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో సీట్ ఎడ్జ్ హార్రర్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రానికి జీవీకే దర్శకత్వం వహిస్తున్నాడు.
ఎస్తర్, ధన్యబాలకృష్ణ, శివ కంఠమనేని, సుప్రిత, హరీష్, అశోక్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ పోస్టర్లో లీడ్ యాక్టర్ల ముఖాలను పూర్తిగా రివీల్ చేయకుండా డార్క్ షేడ్స్‌లో కనిపిస్తున్నారు. చాలా రోజుల తర్వాత కొత్త అప్డేట్ అందించారు మేకర్స్. ఈ మూవీ తాజాగా మధ్యప్రదేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
చింద్వారా జిల్లాలోని తామ్య హిల్స్, పాతాల్ కోట్, బిజోరి, చిమ్‌తీపూర్ లాంటి అందమైన ప్రదేశాల్లో సుమారు 20 రోజుల పాటు షూటింగ్ జరిపినట్టు మేకర్స్ తెలియజేశారు. హనుమాన్ ఫేం సాయిబాబు ఎడిటింగ్‌తో హారర్ థ్రిల్లర్ జోనర్లో సినిమా ఉండబోతుందని డైరెక్టర్ వెల్లడించారు.
డైరెక్టర్ ఏదో ఒక కొత్త అంశాన్ని సిల్వర్ స్క్రీన్‌పై చూపించబోతున్నట్టు ఫస్ట్ లుక్ హింట్ ఇచ్చేస్తుంది. ఈ చిత్రాన్ని లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్‌పై కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వర రావు నిర్మిస్తున్నారు.
Read Also :
Dance Ikon 2 | డ్యాన్స్ ఐకాన్ 2 విన్నర్ ఎనిమిదేళ్ల అమ్మాయి.. ప్రైజ్ మనీ ఎంతంటే
Vijay Devarakonda | రష్మికతో పెళ్లిపై స్పందించిన విజయ్ దేవరకొండ.. క్లారిటీ వచ్చినట్టేనా?