Vijay Devarakonda | గత కొద్ది రోజులుగా విజయ్ దేవరకొండ- రష్మికల ప్రేమ వ్యవహారం టాలీవుడ్లో ఎంత చర్చనీయాంశంగా మారిందో ప్రత్చేకంగా చెప్పనక్కర్లేదు. వారిద్దరు రిలేషన్లో ఉన్నారని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతూ ఉంది. అయితే దానిపై ఇప్పటి వరకు వారు స్పందించింది లేదు. కాకపోతే ఈ జంట ఫెస్టివల్స్ ని కలిసే సెలబ్రేట్ చేసుకోవడం, వెకేషన్స్‌కి కలిసే వెళ్లడం, ఇద్దరిలో ఎవరి బర్త్ డే అయిన కూడా ఏదో వెకేషన్‌కి వెళ్లి అక్కడే కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అందరిలో అనేక అనుమానాలు కలిగిస్తుంది. అయితే విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘కింగ్డమ్’ మూవీ చేస్తుండగా, ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్యూలో పాల్గొన్నాడు విజయ్ దేవరకొండ.
ఇందులో భాగంగా తన పెళ్లి, లైఫ్ పార్ట్నర్, మూవీస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతానికి తనకు జీవిత భాగస్వామి గురించి పెద్దగా ఆలోచన లేదని.. కానీ ఏదో ఒక రోజు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని మాత్రం విజయ్ దేవరకొండ అన్నారు. ఇదే క్రమంలో రష్మిక గురించి మాట్లాడుతూ.. ఆమె చాలా మంచి వ్యక్తి. ఇంకా ఎన్నో మూవీస్‌లో తనతో యాక్ట్ చేయాలని ఉంది అని అన్నారు. మరి జీవిత భాగస్వామికి కావాల్సిన లక్షణాలు రష్మికలో ఉన్నాయా అనే ప్రశ్న ఎదురు కాగా, మంచి మనసు ఉన్న అమ్మాయి ఎవరైనా పర్వాలేదు అని సమాధానం చెప్పారు. మరి విజయ్ దేవరకొండ చెప్పిన సమాధానం బట్టి చూస్తుంటే తమ ప్రేమ గురించి క్లూ ఇచ్చారని, అఫీషియల్‌గా ప్రకటించడమే తరువాయి అని అంటున్నారు
ఇక విజయ్ దేవరకొండ, రష్మిక టాలీవుడ్ క్రేజీ జంట అనే విషయం మనందరికి తెలిసిందే. వీరి కాంబినేషన్లో పలు చిత్రాలు టాలీవుడ్లో రూపొందాయి. ఇందులొఓ గీత గోవిందం సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ సమయం నుండే వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారనే టాక్ ఉంది. ఇక ఆ తరువాత వీరిద్దరి కాంబోలో వచ్చిన డియర్ కామ్రేడ్ చిత్రం డిజాస్టర్‌గా మిగిలింది. ఈ రెండు చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి పని చేయక పోయిన ఇద్దరి మధ్య మాత్రం మంచి బాండింగ్ ఉందని అంటున్నారు. ఇటీవల రష్మిక.. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవర కొండ మూవీ ఓపెనింగ్‌కి గెస్ట్‌గా హాజరైన విషయం తెలిసిందే.