మునుగోడు, మే 17 : మునుగోడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఆవాస గ్రామమైన లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన ఎంపల్ల నరేశ్ (35) పది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. విషయం తెలుసుకున్న బాల్య మిత్రులు (2008-09 ) పదో తరగతి బ్యాచ్ స్నేహితులు వాట్సప్ వేదికగా ఒకరికొకరు చర్చించుకుని తోచిన ఆర్థిక సహాయం అందించారు. ఇలా సమకూరిన రూ.1,02,000 అలాగే 25 కేజీల రైస్ బ్యాగ్‌ను నరేశ్ కుటుంబ సభ్యులకు శనివారం అందజేశారు. స్నేహితుని కుటుంబానికి అండగా నిలవడంతో పలువురు వీరిని అభినందించారు.