IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ పునరుద్ధరణతో ప్లే ఆఫ్స్ రేసులలోని జట్లు విజయంపై కన్నేశాయి. నాకౌట్, ఫైనల్ మ్యాచ్‌ల కోసం బీసీసీఐ కూడా సన్నాహకాలు చేస్తోంది. కొత్త షెడ్యూల్ ప్రకటన సమయంలోనే ఫైనల్ వేదిక మారుతుందనే వదంతులు వినిపించాయి. జూన్ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టైటిల్ పోరు నిర్వహిస్తారని సమాచారం ఉంది. అయితే.. ఈ వార్తల్ని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) ఖండించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైనల్ ఫైట్‌ను ఈడెన్ గార్డెన్స్(Eden Gardens)లో జరిపితీరుతామని చెబుతున్నాడు దాదా.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే25న ఫైనల్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సింది. కానీ, ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) అనంతరం పరిస్థితులతో టోర్నీ వారం పాటు వాయిదా పడింది. దాంతో.. ఆగిపోయిన లీగ్ మ్యాచ్‌ల నిర్వహణతో పాటు ప్లే ఆఫ్స్, ఫైనల్ తేదీలు కూడా మారాయి. అయితే.. టైటిల్ పోరుకు అహ్మదాబాద్ వేదిక కానుందనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గంగూలీ అవన్నీ ఊహగానాలే అని కొట్టిపారేశాడు.
VIDEO | “We are trying… talks are underway with BCCI. It’s not easy to pull it out of here,” says former BCCI president Sourav Ganguly (@SGanguly99) on talks to organise IPL 2025 final at Eden Gardens in Kolkata.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/8dw4YJlf9N
— Press Trust of India (@PTI_News) May 17, 2025
‘బీసీసీఐ, ఐపీఎల్ పాలకమండలితో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. బీసీసీఐ ఇప్పటివరకూ ప్లే ఆఫ్స్, ఫైనల్ వేదికల్ని ప్రకటించలేదు. సో.. ఈడెన్ గార్డెన్స్‌లో టైటిల్ పోరు జరుగదనే వార్తల్ని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే.. ఆనవాయితీ ప్రకారం డిఫెండింగ్ ఛాంపియన్ గడ్డమీదే ఫైనల్ ఆడించాలి. కాబట్టి.. ముందుగానే ఖరారు చేసిన వేదికను మార్చడం అంత సులభం కాదు. ఈ విషయమై మేము బీసీసీఐ ప్రతినిధులతో మాట్లాడుతున్నాం. అలాఅనీ నిరసన తెలపాలని మేము అనుకోవడం లేదు’ అని శనివారం గంగూలీ వెల్లడించాడు.
వాయిదాకు ముందు షెడ్యూల్ ప్రకారం మే 23న క్వాలిఫయర్ 2, మే 25న ఫైనల్ మ్యాచ్‌లు ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతాయని బీసీసీఐ చెప్పింది. కానీ.. భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతల వల్ల సీన్ మారిపోయింది. ఒకదశలో టోర్నీ జరగడంపైనే సందేహాలు నెలకొన్నాయి. అయితే.. ఇరుదేశాల కాల్పుల విరమణ (Ceasefire)తో సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో, మే 17 నుంచి లీగ్‌ను పునరుద్ధరిస్తున్నట్టు బీసీసీఐ తెలిపింది. అంతేకాదు జూన్ 3న ఫైనల్ అంటూ కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది.
A lot to play for as the road to playoffs intensifies 🤩
Who can make it to the Top 4⃣? 🤔
🔽 Read to find out 🔗 | #TATAIPL
https://t.co/8FTBbz7f0j pic.twitter.com/ThW6O9VSUC— IndianPremierLeague (@IPL) May 16, 2025