Watch: వివాహ రిసెప్షన్‌ను అడ్డుకున్న మహిళ.. మోసం చేశాడంటూ వరుడిపై దాడి
Woman disrupts wedding reception | పోలీసులతో కలిసి వచ్చిన మహిళ వివాహ రిసెప్షన్‌ను అడ్డుకున్నది. వరుడిపై దాడి చేసి కొట్టింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతడు మోసం చేశాడని ఆమె ఆరోపించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
భువనేశ్వర్: పోలీసులతో కలిసి వచ్చిన మహిళ వివాహ రిసెప్షన్‌ను అడ్డుకున్నది. (Woman disrupts wedding reception) వరుడిపై దాడి చేసి కొట్టింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతడు మోసం చేశాడని ఆమె ఆరోపించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం రాత్రి ధౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్యాణ మండపంలో పెళ్లి రిసెప్షన్ జరిగింది. ఇంతలో ఒక మహిళ పోలీసులతో కలిసి అక్కడకు వచ్చింది. వివాహ రిసెప్షన్‌ను ఆమె అడ్డుకున్నది. వరుడిపై దాడి చేసి కొట్టింది. అక్కడున్న వారు వారిని విడిపించేందుకు ప్రయత్నించారు.
కాగా, ఆ వ్యక్తితో తనకు నిశ్చితార్థం జరిగిందని ఆ మహిళ ఆరోపించింది. అతడు తనను మోసం చేసి మరో పెళ్లి చేసుకున్నాడని, తన నుంచి రూ.5 లక్షలు తీసుకున్నాడని ఆమె వాపోయింది. దీంతో పోలీసులు ఆ వరుడ్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మహిళ ఆరోపణలపై ఆరా తీశారు. అయితే పోలీసుల సమక్షంలో వారిద్దరి మధ్య రాజీ కుదిరినట్లు బంధువులు తెలిపారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Woman disrupts wedding reception in Bhubaneswar, accuses groom of betrayal#odisha #Bhubaneswar pic.twitter.com/93FSXrf1Ch
— Karthick Chandrasekar (@kart997) May 13, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

