Podapathri Leaves | పొడపత్రి ఆకు.. దీన్నే కేరళ జిన్సెంగ్ అని, బ్రహ్మ మూలిక అని కూడా పిలుస్తారు. ఈ మొక్క మన దేశంలోని పశ్చిమ కనుమల్లో ఎక్కువగా పెరుగుతుంది. కేరళలో ఈ మొక్కలు మనకు ఎక్కడ చూసినా కనిపిస్తాయి. ఆయుర్వేదంలో ఈ మొక్క ఆకులను ఎంతో పురాతన కాలం నుంచే ఉపయోగిస్తున్నారు. ఈ మొక్క ఆకులు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. పొడపత్రి ఆకులను నేరుగా తినవచ్చు. లేదా రసం చేసి కొద్ది మొత్తాల్లో తాగవచ్చు. పొడ పత్రి ఆకులను తీసుకోవడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. అలసట, నీరసం తగ్గుతాయి. ఒత్తిడి, ఆందోళ నుంచి ఉపశమనం లభిస్తుంది. పొడపత్రి ఆకులను తీసుకోవడం వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. శృంగారంలో చురుగ్గా పాల్గొంటారు. ఇందుకు గాను ఆకులను రాత్రి పూట తినాల్సి ఉంటుంది.
పొడపత్రి ఆకుల్లో ఇమ్యునో మాడ్యులేటరీ గుణాలు సమృద్దిగా ఉన్నాయి. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం ఈ ఆకులను తినడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గిపోతాయి. పొడపత్రి ఆకుల్లో బయో యాక్టివ్ సమ్మేళనాలు అధికంగా ఉన్నాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ల మాదిరిగా పనిచేస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్ బారి నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలించడంతోపాటు కణాలను రక్షిస్తాయి. దీంతో క్యాన్సర్, గుండె జబ్బుల వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. పొడపత్రి ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలింది. అందువల్ల ఈ ఆకులను తింటే వాపులు, నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది.
పొడపత్రి ఆకుల్లో యాంటీ ఫాటిగ్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఈ ఆకులను తింటే ఎంతటి నీరసం, అలసట అయినా త్వరగా తగ్గిపోతాయి. మళ్లీ చురుగ్గా మారుతారు. ఉత్సాహంగా పనిచేస్తారు. యాక్టివ్‌గా ఉంటారు. పొడపత్రి ఆకుల్లో న్యూరో ప్రొటెక్టివ్ గుణాలు ఉంటాయి. కనుక ఈ ఆకులను తింటే నరాల బలహీనత తగ్గుతుంది. నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. పొడపత్రి ఆకులను షుగర్ ఉన్నవారికి వరంగా చెప్పవచ్చు. ఈ ఆకులను తింటే షుగర్ లెవల్స్ క్రమంగా తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఈ ఆకులను తినడం వల్ల పిండి పదార్థాలు నెమ్మదిగా రక్తంలో కలుస్తాయి. దీంతో షుగర్‌ను ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవచ్చు.
పొడపత్రి ఆకులను నేరుగా తినవచ్చు. లేదా రసం తీసి తాగవచ్చు. కానీ స్వల్ప మొత్తాల్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఇది వ్యక్తి శరీర తత్వం, ఉన్న వ్యాధిని బట్టి మారుతుంది. కనుక ఈ ఆకులను వాడాలనుకుంటే ఆయుర్వేద వైద్యుల సలహా తీసుకోవాలి. ఒకటి లేదా రెండు ఆకులను తినడం, ఒక టీస్పూన్ రసం సేవించడం సురక్షితంగా భావిస్తారు. పలు రకాల ఆయుర్వేద ఔషధాల తయారీలోనూ పొడపత్రి ఆకులను విరివిగా ఉపయోగిస్తారు. రాత్రి పూట పొడపత్రి ఆకులను పాలతో తీసుకుంటే పురుషులకు మేలు జరుగుతుంది. గాయాలు, పుండ్లు, చర్మ సమస్యలను తగ్గించేందుకు కూడా ఈ ఆకులను ఉపయోగించవచ్చు. కొద్దిగా పేస్ట్‌లా చేసి ఈ ఆకులను రాస్తుంటే గాయాలు, పుండ్లు త్వరగా తగ్గుతాయి. అయితే అలర్జీలు ఉన్నవారు ఈ ఆకులను వాడకూదు.