Team India : ఇంగ్లండ్ పర్యటనను సవాల్‌గా తీసుకున్న సెలెక్టర్లు పటిష్టమైన స్క్వాడ్ ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే భారత ఏ జట్టు బృందాన్ని ప్రకటించిన బీసీసీఐ.. తాజాగా కొత్త కోచ్‌ను నియమించింది. మాజీ ఆల్‌రౌండర్ అయిన హృషికేశ్ కొనిట్కర్ (Hrishikesh Konitkar)కు బాధ్యతలు అప్పగించింది. ఇంగ్లండ్ లయన్స్‌తో మూడు నాలుగురోజుల మ్యాచ్‌లకు హృషికేశ్ ఏ జట్టులోని ఆటగాళ్లకు సూచనలు ఇవ్వనున్నాడు. అతడితో పాటు ఫీల్డింగ్ కోచ్‌గా శుభోదీప్ ఘోష్ (అస్సాం), బౌలింగ్ కోచ్‌గా ట్రోనీ కూలేలు అభిమన్యు ఈశ్వరన్ బృందానికి సేవలందించనున్నారు.
మహారాష్ట్రకు చెందిన హృషికేశ్ ఆల్‌రౌండర్‌గా 1999లో ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేశాడు. అదే ఏడాది వన్డేల్లోనూ అడుగు పెట్టిన అతడు శ్రీలంకపై మొదటి మ్యాచ్ ఆడాడు. అయితే.. అంతర్జాతీయంగా హృషికేశ్ కెరిర్ ఏడాదికే పరిమితమైంది. 2000 జనవరిలో ఆస్ట్రేలియాపై అతడు చివరి టెస్టు ఆడాడు. ఆ తర్వాత కోచ్ అవతారం ఎత్తిన అతడు.. మహిళల జట్టును తీర్చిదిద్దాడు.
హృషికేశ్ ఆధ్వర్యంలో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు 2022 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించింది. అదే ఏడాది ఇండియా ఏ, అండర్ -19 జట్లుకూ హృషికేశ్ కోచింగ్ ఇచ్చాడు. సో.. అతడి అనుభవం ఇంగ్లండ్ పర్యటనలో భారత ఏ జట్టుకు పనికొస్తుందని బీసీసీఐ భావిస్తోంది.
సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్‌ల గైర్వాజరీలో భారత జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లుతోంది. ఈ నేపథ్యంలో బలమైన స్క్వాడ్‌ను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు సెలెక్టర్లు. అంతకంటే ముందు.. ఏ జట్టును అక్కడికి పంపుతున్నారు. మే 25న అభిమన్యు ఈశ్వరన్(Abhimanyu Easwaran) నేతృత్వంలోని బృందం ఇంగ్లండ్ బయల్దేరనుంది.
BCCI announce a strong squad for the upcoming India A tour of England, which precedes the upcoming five-match Test series 🇮🇳 pic.twitter.com/fM1lFcKA9d
— ESPNcricinfo (@ESPNcricinfo) May 16, 2025
అక్కడ మే 30న ఇంగ్లండ్ లయన్స్‌తో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జూన్ 6న నార్తంప్టన్ వేదికగా రెండో మ్యాచ్‌లో ఇరుజట్లు తలపడుతాయి. ఆ తర్వాత జూన్ 13 ఉనంచి 16 వరకూ భారత స్క్వాడ్ రెండుగా విడిపోయి ఆడనుంది.
భారత ఏ జట్టు స్క్వాడ్ : అభిమన్యు ఈశ్వరన్(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, శార్ధూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), మానవ్ సుథార్, తనుష్ కొతియాన్, ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్, హర్షిత్ రానా, అన్షుల్ కంబోజ్, ఖలీల్ అహ్మద్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దూబే.
సీనియర్ జట్టులో ఆడనున్న సర్పరాజ్ ఖాన్, మెల్బోర్న్లో సెంచరీ బాదిన నితీశ్ కుమార్ రెడ్డి.. లార్డ్స్ శార్దూల్‌ను అక్కడి పరిస్థితులకు అలవడతారనే ఉద్దేశంతో ఏ జట్టులోకి తీసుకున్నారు సెలెక్టర్లు. ఈమధ్యే సెంట్రల్ కాంట్రాక్ట్ సాధించిన ఇషాన్ కిషన్ రెండో వికెట్ కీపర్‌గా స్క్వాడ్‌లోకి వచ్చాడు. హర్షిత్ రానా, అన్షుల్ కంబోజ్, తుషార్ దేశ్‌పాండేలతో కూడిన పేస్ బౌలింగ్‌కు అనుభవజ్ఞుడైన ఖలీల్ అహ్మద్‌ను నాయకత్వం వహించనున్నాడు.