మంగళవారం 26 జనవరి 2021
Sports - Jan 12, 2021 , 16:36:53

జడేజా సర్జరీ సక్సెస్‌..

జడేజా సర్జరీ సక్సెస్‌..

సిడ్నీ: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా గాయం కారణంగా ఆస్ట్రేలియాతో  ఆఖరి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. మంగళవారం 32ఏండ్ల జడేజా బొటనవేలికి నిర్వహించిన శస్త్ర చికిత్స విజయవంతమైంది. ఎడమచేతి బొటనవేలికి సర్జరీ అనంతరం చేతికి పట్టితో ఉండగా తీసిన ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేసిన జడేజా త్వరలో తిరిగి వస్తానని పేర్కొన్నాడు.  

'కొద్దిరోజులు ఆటకు దూరంగా ఉంటా. శస్త్రచికిత్స పూర్తైంది. కానీ, త్వరలోనే రెట్టించిన బలంతో తిరిగొస్తానని' జడ్డూ ట్వీట్‌  చేశాడు. జడేజా ట్వీట్‌పై బీసీసీఐ స్పందించింది. మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్‌ చేసింది. భారత్‌, ఆస్ట్రేలియా మధ్య కీలకమైన నాలుగో టెస్టు బ్రిస్బేన్‌ వేదికగా జనవరి 15-19 మధ్య జరగనుంది. 


logo