Ranji Trophy 2024 | ముంబైకి షాకిచ్చిన విదర్భ బౌలర్లు.. ఆదుకున్న శార్దూల్
Ranji Trophy 2024 | ముంబైలోని వాంఖెడే వేదికగా జరుగుతున్న ఫైనల్లో టాస్ ఓడి తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన ముంబై.. 64.3 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌట్ అయింది. రంజీ సెమీస్లో సెంచరీ చేసి ముంబైని ఆదుకున్న శార్దూల్.. ఫైనల్లోనూ ఆ జట్టుకు ఆపద్బాంధవుడి పాత్రను పోషించాడు.
Ranji Trophy 2024 | నేటి నుంచి మొదలైన రంజీ ట్రోఫీ ఫైనల్లో 41 సార్లు ఈ ట్రోఫీ ఛాంపియన్ ముంబైకి విదర్భ షాకిచ్చింది. ముంబైలోని వాంఖెడే వేదికగా జరుగుతున్న ఫైనల్లో టాస్ ఓడి తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన ముంబై.. 64.3 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌట్ అయింది. రంజీ సెమీస్లో సెంచరీ చేసి ముంబైని ఆదుకున్న శార్దూల్.. ఫైనల్లోనూ ఆ జట్టుకు ఆపద్బాంధవుడి పాత్రను పోషించాడు. 69 బంతుల్లోనే 8 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో శార్దూల్.. 75 రన్స్ చేశాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు వచ్చిన ముంబైకి ఓపెనర్లు పృథ్వీ షా (46), భూపేన్ లల్వాని (37) లు శుభారంభాన్ని ఇచ్చారు. ఈ ఇద్దరూ తొలి వికెట్కు 81 పరుగులు జోడించారు. కానీ స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరూ ఔట్ అయిన తర్వాత ముంబై ఇన్నింగ్స్ కుదుపునకు లోనైంది. ముషీర్ ఖాన్ (6), కెప్టెన్ అజింక్యా రహానే (7), శ్రేయస్ అయ్యర్ (7), హార్ధిక్ తమోర్ (5), శామ్స్ ములాని (13)లు విఫలమయ్యారు.
A SOLID FIGHTBACK BY SHARDUL THAKUR….!!!!
75 (69) with 8 fours and 3 sixes when Mumbai were in massive trouble. He scored a century in the Semis and now a gritty 75 in the Final. 👏 pic.twitter.com/rUCQu4er7E
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 10, 2024
ఏడో స్థానంలో వచ్చిన శార్దూల్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 37 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేసిన అతడు.. భారీ షాట్లు ఆడి విదర్భ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కానీ టీ విరామం తర్వాత కొద్దిసేపటికే ముంబై.. ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన విదర్భ.. మూడో ఓవర్లోనే తొలి వికెట్ను కోల్పోయింది. బ్యాటింగ్లో ముంబైని ఆదుకున్న శార్దూల్.. బౌలింగ్లోనూ ముంబైకి తొలి బ్రేక్ ఇచ్చాడు. అతడు వేసిన మూడో ఓవర్లో ద ఓపెనర్ ధ్రువ్ షోరే డకౌట్ అయ్యాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

