IPL 2024 | రాజస్థాన్ ‘పింక్ ప్రామిస్’.. ఒక్కో సిక్సర్‌కు ఆరు ఇండ్లలో సౌర వెలుగులు
IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్ ఉత్కంఠ పోరాటాలతో రంజుగా సాగుతోంది. ఈ మెగా టోర్నీలో హ్యాట్రిక్ విజయాలు కొట్టిన రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) మరో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్బంగా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కీలక...
IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్ ఉత్కంఠ పోరాటాలతో రంజుగా సాగుతోంది. ఈ మెగా టోర్నీలో హ్యాట్రిక్ విజయాలు కొట్టిన రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) మరో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. శనివారం సొంతగడ్డపై సంజూ శాంసన్(Sanju Samson) సేన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru)తో తలపడనుంది. ఈ సందర్బంగా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆర్ఆర్, ఆర్సీబీ మ్యాచ్‌లో బ్యాటర్లు కొట్టే ప్రతి సిక్సర్‌కు ఆరు ఇండ్లలో సౌర వెలుగులు నింపనుంది. అవును.. పింక్ ప్రామిస్(Pink Pormise)లో భాగంగా ఒక్కో సిక్సర్‌కు ఆరు చొప్పున సోలార్ ప్యానెళ్ల(Solar Pannels)ను ఏర్పాటు చేయనుంది.
Watch till the end. 🔥 pic.twitter.com/Y3VAREeH72
— Rajasthan Royals (@rajasthanroyals) April 6, 2024
సాంబార్ జిల్లాతో పాటు రాజస్థాన్‌లోని పేద ఇండ్లలో సోలార్ వెలుగులు నింపేందుకు ఫ్రాంచైజీ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. ఈ మ్యాచ్‌ను మహిళలు ఉచితంగా చూసేందుకు పింక్ పాస్‌లను అందజేశారు. దాంతో, పవర్ హిట్టర్లతో నిండిన బెంగళూరు, రాజస్థాన్ జట్లు ఎన్ని సిక్సర్లు కొడుతాయోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Tonight, we’re walking out to play for the women of Rajasthan… 💗#PinkPromise pic.twitter.com/ZPulqvGBI5
— Rajasthan Royals (@rajasthanroyals) April 6, 2024
పరాగ్ మెరుపులతో..
పదిహేడో సీజన్లో రాజస్థాన్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. టాపార్డర్ విఫలమైనా రియాన్ పరాగ్ మెరుపులతో మూడింటా మూడు విజయాలతో సంజూ సేన పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు ఆర్సీబీ నాలుగు మ్యాచుల్లో ఒకే ఒక విజయంతో సరిపెట్టుకుంది. దాంతో, ఎలాగైనా రాజస్థాన్‌పై గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలనే కసితో డూప్లెసిస్ సేన వ్యూహాలు పన్ననుంది. అయితే.. సొంతగడ్డపై తిరుగులేని రాజస్థాన్‌కు ఆర్సీబీ బౌలర్లు ఎలా చెక్ పెడతారు? అనేది మరికొన్ని గంట్లల్లో తెలిసిపోనుంది.

ఇవి కూడా చదవండి
- MP Sanjay Singh | జైలులో ఎంపీ సంజయ్ సింగ్ బరువు పెరిగారు..!
- Lancet study | పెరుగుతున్న ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు.. 2040 నాటికి రెట్టింపయ్యే ఛాన్స్.. లాన్సెట్ అధ్యయనంలో వెల్లడి
- Postal Ballot | జర్నలిస్టులకు ముఖ్య గమనిక.. పోస్టల్ బ్యాలెట్‌కు 12లోగా దరఖాస్తు చేసుకోండి..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

