Atiq Ahmed | కారు ప్రమాదంలో అతిక్ అహ్మద్ కుమారుడు అబాన్ మృతి.. మరో ముగ్గురికి గాయాలు
Atiq Ahmed : గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అబాన్ (21) రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతడితోపాటు కారులో ప్రయాణిస్తున్న ఇంకో స్నేహితుడు కూడా మరణించగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ పరిధిలో గురువారం జరిగింది.
Atiq Ahmed : గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అబాన్ (21) రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతడితోపాటు కారులో ప్రయాణిస్తున్న ఇంకో స్నేహితుడు కూడా మరణించగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ పరిధిలో గురువారం జరిగింది. ఉత్తర ప్రదేశ్‌లో పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్. రాజకీయ నాయకుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడిపై అనేక కేసులు నమోదయ్యాయి. తన అనుచరులతో హత్యలు, బెదిరింపులు వంటి ఘటనలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో 2023లో అతిక్ శతృవులు అతడిని అతి సమీపం నుంచి కాల్చి చంపారు.
అతిక్ చిన్న కొడుకైన అబాన్ అహ్మద్.. స్నేహితులతో కలిసి ప్రయాగ్ రాజ్ నుంచి ఝాన్సీకి వైట్ హ్యుండాయ్ క్రెటా కారులో బయల్దేరాడు. జైలులో ఉన్న తన సోదరుడిని కలుసుకునేందుకు గురువారం వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. ఒక జంతువు అడ్డురావడంతో దానిని తప్పించేందుకు కారు డ్రైవర్ ప్రయత్నించాడు. అయితే, కారు అతివేగంతో ఉండటంతో అదుపుతప్పి, పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో అతిక్ అహ్మద్‌తోపాటు, అతడి స్నేహితుడు సోను కూడా మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. స్తానికులు, పోలీసులు కారులో గాయపడ్డ ఐదుగురిని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అబాన్, అతడి స్నేహితుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఇద్దరి మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారికి చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనలో వాహనం చాలా వరకు ధ్వంసమైందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అతీక్‌తోపాటు, అతడి కుటుంబానికి కూడా తీవ్రమైన నేర చరిత్ర ఉంది. 2023లో జరిగిన ఎన్కౌంటర్లో అతిక్ కొడుకు అసద్ అహ్మద్ మరణించాడు. అతడి రెండో కొడుకు అలీ అహ్మద్ ఝాన్సీ జైలులో ఉన్నాడు. అతడిపై 10 వరకు క్రిమినల్ కేసులున్నాయి. అతడిని కలిసేందుకు అబాన్ వెళ్తుండగానే ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అతిక్ మరో కొడుకు ఉమర్ అహ్మద్ లక్నో జైలులో ఉన్నాడు. అతిక్ చిన్న కొడుకు అబాన్ ఈ నేరచరిత్రకు దూరంగా ఉంటున్నాడు. అతడు చదువుకుంటున్నాడు. మరో కొడుకు ఆజామ్ కూడా చదువుకుంటున్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

