IND vs SL : శ్రీలంక పర్యటనలో తొలి షాక్ తిన్న భారత జట్టు(Team India) రెండో వన్డేలో విజయంపై కన్నేసింది. మరోవైపు ఆఖరిదాకా పోరాడిన ఆతిథ్య లంక ఈసారి బోణీ కొట్టాలనే పట్టుదలతో ఉంది. అయితే.. ఆగస్టు 4వ తేదీ ఆదివారం టీమిండియా, లంక మధ్య జరుగబోయే రెండో వన్డేకు వాన ముప్పు (Rain Threat) పొంచి ఉంది. ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ ఆరంభానికి ముందే వర్షం పడనుందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది.
ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వాన కురిసే అవకాశం 38 శాతం ఉందని, అదే సాయంత్రం పూట చినుకులు పడేందుకు 41 శాతం నుంచి 63 శాతం అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ వాన కారణంగా రెండో వన్డే రద్దయితే మూడో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. సిరీస్ విజేత దాంతో, సిరీస్‌లో బోణీ కొట్టేది ఎవరు? అని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది.
Things went down to the wire in Colombo as the match ends in a tie!
On to the next one.
Scorecard ▶️ https://t.co/4fYsNEzggf#TeamIndia | #SLvIND pic.twitter.com/yzhxoyaaet
— BCCI (@BCCI) August 2, 2024
పొట్టి సిరీస్‌లో శ్రీలంకను క్లీన్‌స్వీప్ చేసిన భారత జట్టు తొలి వన్డేలో చేజేతులా ఓడింది. స్వల్ప ఛేదనలో విజయానికి ఒక్క పరుగు అవసరమైన వేళ చివరి రెండు వికెట్లు కోల్పోయి టైతో సరిపెట్టుకుంది. తొలుత దునిత్ వెల్లలాగే(67 నాటౌట్), ఓపెనర్ పథుమ్ నిశాంక(52) మెరుపులతో లంక 230 రన్స్ కొట్టింది. అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ(58) అర్ధ శతకంతో మెరవగా.. అక్షర్ పటేల్(33), కేఎల్ రాహుల్(31)లు విలువైన ఇన్నింగ్స్‌తో జట్టును గెలుపు వాకిట నిలిపారు.
A thrilling start to the #SLvIND ODI series.
The First ODI ends in a tie.
Scorecard ▶️ https://t.co/4fYsNEzggf#TeamIndia pic.twitter.com/ILQvB1FDyk
— BCCI (@BCCI) August 2, 2024
వీళ్లిద్దరూ ఔటయ్యాక ఆల్‌రౌండర్ శివం దూబే(25) ధనాధన్ బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ముగించినంత పని చేశాడు. లంక కెప్టెన్ చరిత అసలంక వేసిన 48వ ఓవర్లో దూబే బౌండరీ బాదగా స్కోర్ సమం అయింది. కానీ, అసలంక వరుస బంతుల్లో దూబే, అర్ష్‌దీప్ సింగ్‌లను ఎల్బీగా వెనక్కి పంపడంతో అనూహ్యంగా తొలి వన్డే మ్యాచ్ టైగా ముగిసింది.