Health tips | అనాస పువ్వుతో ఆహారానికి సువాసనే కాదు.. ఆరోగ్యపరంగా కూడా ఎన్నో లాభాలు..!
Health tips : బిర్యానీలు, మాంసాహార వంటకాల్లో కమ్మదనం కోసం మనం చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, అనాస పువ్వు (Star anise) లాంటి సుగంధ ద్రవ్యాలు వాడుతాం. వాటిలో అనాస పువ్వు అన్నింటికంటే మేలైనది. దీనివల్ల ఆహారానికి కమ్మటి వాసన వస్తుంది. ఈ అనాస పువ్వు చూడటానికి చక్రంలాగా ఉంటుంది. అందుకే దీన్ని చక్ర ఫూల్ అని కూడా అంటారు. వంటల్లో వాడే ఈ అనాస పువ్వువల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం..
Health tips : బిర్యానీలు, మాంసాహార వంటకాల్లో కమ్మదనం కోసం మనం చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, అనాస పువ్వు (Star anise) లాంటి సుగంధ ద్రవ్యాలు వాడుతాం. వాటిలో అనాస పువ్వు అన్నింటికంటే మేలైనది. దీనివల్ల ఆహారానికి కమ్మటి వాసన వస్తుంది. ఈ అనాస పువ్వు చూడటానికి చక్రంలాగా ఉంటుంది. అందుకే దీన్ని చక్ర ఫూల్ అని కూడా అంటారు. వంటల్లో వాడే ఈ అనాస పువ్వువల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం..
జీర్ణశక్తి
బిర్యానీ, బగారా, మాంసం లాంటి వంటల్లో అనాస పువ్వును కచ్చితంగా ఉపయోగించడానికి కారణం అది జీర్ణశక్తిని పెంచడమే. ఈ పువ్వులోని అనెథోల్ సమ్మేళనాలు జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. ఉబ్బరం, అజీర్తి లక్షణాలను తగ్గించడంలో సాయపడతాయి.
రోగ నిరోధకత
అనాస పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఈ సమ్మేళనాలు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ను తొలగించడంలో సాయపడతాయి. తద్వారా రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాలకు వ్యతిరేకంగా శరీరంలో రక్షణ వ్యవస్థ బలోపేతమవుతుంది.
శ్వాస సంబంధ సమస్యలు
సాంప్రదాయ చైనీస్ వైద్యంలో దగ్గు, జలుబు, ఉబ్బసం వంటి శ్వాసకోశ సంబంధ వ్యాధులను తగ్గించడానికి అనాస పువ్వును గత కొన్ని శతాబ్దాలుగా వాడుతున్నారు. దీనిలోని ఔషధ లక్షణాలు శ్వాసకోశాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతాయి.
యాంటీ మైక్రోబయల్
అనాస పువ్వులో వివిధ వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మజీవులను నాశనం చేయడానికి యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, శిలీంధ్రాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. దాంతో బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చర్మ వ్యాధులు కూడా నయమవుతాయి.
హార్మోనల్ బ్యాలెన్స్
సాంప్రదాయ ఔషధాల తయారీలో కూడా అనాస పువ్వును ఉపయోగిస్తారు. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్లు సమతుల్యంగా ఉండటంలో ఇది సాయపడుతుంది. ఇది శరీరంలో ఈస్ట్రోజెన్ చర్యను అనుకరించే ఫైటో ఈస్ట్రోజెన్లు, మొక్కల సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఇవి నెలసరి సమస్యల పరిష్కారంలో తోడ్పడుతాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

