Yamini Krishnamurthy | ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత..
Yamini Krishnamurthy | ప్రముఖ భరతనాట్యం, కూచిపూడి నర్తకి యామినీ కృష్ణమూర్తి (84) ఇక లేరు. ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఢిల్లీలోని అపోలో ఆసుప్రతిలో కన్నుమూశారు. యామినీ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లె. ఆమె ప్రముఖ భారతీయ నర్తకిగా ఖ్యాతిని పొందారు.
Yamini Krishnamurthy | ప్రముఖ భరతనాట్యం, కూచిపూడి నర్తకి యామినీ కృష్ణమూర్తి (84) ఇక లేరు. ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఢిల్లీలోని అపోలో ఆసుప్రతిలో కన్నుమూశారు. యామినీ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లె. ఆమె ప్రముఖ భారతీయ నర్తకిగా ఖ్యాతిని పొందారు. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాల్లో నిష్ణాతురాలు. కర్ణాటక సంగీతం సైతం నేర్చుకొని పాటలు పాడుతూ నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. మదనపల్లిలో 1940వ సంవత్సరం డిసెంబరు 20న జన్మించింది. ఆమె తండ్రి కృష్ణమూర్తి సంస్కృత పండితుడు. తాత ఉర్దూ కవి.
ఆమె కుటుంబం తమిళనాడులోని చిదంబరంలో స్థిరపడింది. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో ప్రావీణ్యం సంపాదించిన యామిని 1957లో తొలి నృత్య ప్రదర్శన ఇచ్చింది. అప్పటి నుంచి దేశ, విదేశాల్లో వేలాదిగా ప్రదర్శనలిచ్చారు. యామినీ కృష్ణమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తకిగా పని చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో నృత్య కేంద్రం స్థాపించి పలువురికి శిక్షణ ఇచ్చారు. ఆమెకు భారతీయ కళారంగానికి చేసిన సేవకు కేంద్రం తొలిసారిగా 1968లో పద్మశ్రీతో సత్కరించింది. 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలను అందింది. అలాగే, 1977లో సంగీతనాటక అకాడమీ అవార్డును సైతం అందుకున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

