KL Rahul : భారత జట్టుకు ఆపద్భాందవుడైన కేఎల్ రాహుల్ (KL Rahul) ఐపీఎల్‌లోనూ అదరగొడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్‌కు వెన్నెముకలా నిలుస్తున్న రాహుల్ ఐపీఎల్ 18వ సీజన్లో శతకంతో గర్జించాడు. ఆదివారం గుజరాత్ టైటాన్స్ బౌలర్లను ఊచకోత కోస్తూ 60 బంతుల్లోనే మెరుపు సెంచరీ సాధించాడీ హిట్టర్. తద్వారా ఐపీఎల్లో ఐదోసారి మూడంకెల స్కోర్ అందుకున్న రాహుల్.. రికార్డులు తిరగరాశాడు.
ఐపీఎల్లో మూడు జట్ల తరఫున సెంచరీ బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు రాహుల్. పంజాబ్ కింగ్స్(Punjab Kings), లక్నో సూపర్ జెయింట్స్ తరఫున వంద కొట్టిన అతడు.. ఇప్పుడు ఢిల్లీ తరఫున శతక్కొట్టాడు. అంతేకాదు ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు కొట్టిన నాలుగో క్రికెటర్‌గా, రెండో భారతీయుడిగా ఈ డాషింగ్ బ్యాటర్ ఘనత సాధించాడు.
𝘽𝙖𝙩 𝙧𝙖𝙞𝙨𝙚𝙙. 𝙈𝙤𝙢𝙚𝙣𝙩 𝙤𝙬𝙣𝙚𝙙 🌟
KL Rahul soaks in the applause after a stunning 💯
Updates ▶ https://t.co/4flJtatmxc #TATAIPL | #DCvGT | @DelhiCapitals | @klrahul pic.twitter.com/xVuEzXaa9u
— IndianPremierLeague (@IPL) May 18, 2025
అంతర్జాతీయ టీ20ల పరంగా చూస్తూ.. రాహుల్‌కు ఇది ఏడో వంద కావడం విశేషం. అంతేకాదు పొట్టి క్రికెట్లో అత్యంత వేగంగా 8 వేల పరుగలు మైలురాయికి చేరుకున్నాడు. 224 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతకు చేరువైన రాహుల్.. విరాట్ కోహ్లీని అధిగమించాడు. విరాట్ 243 ఇన్నింగ్స్‌ల్లో 8వేల క్లబ్లో చేరాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ విధ్వంసక ఓపెన్ క్రిస్ గేల్(Chris Gayle) టాప్‌లో ఉన్నాడు.
ఐపీఎల్ శతక వీరుల జాబితాలో విరాట్ కోహ్లీ (Virat Kohli) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆరంభ సీజన్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న విరాట్ ఎనిమిసార్లు వందకు చేరువయ్యాడు. జోస్ బట్లర్ 7 సెంచరీతో రెండో స్థానంలో ఉండగా.. మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ 6 శతకాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
𝙎𝙩𝙖𝙣𝙙 𝙪𝙥 𝙖𝙣𝙙 𝘼𝙥𝙥𝙡𝙖𝙪𝙙 👏
An innings of the highest caliber from KL Rahul 🫡
Updates ▶ https://t.co/4flJtatmxc #TATAIPL | #DCvGT | @DelhiCapitals | @klrahul pic.twitter.com/rV2aWxxJZk
— IndianPremierLeague (@IPL) May 18, 2025
ఇక టీ20ల్లో అత్యధిక సెంచరీలు కొట్టిన ఇండియన్‌గా కోహ్లీ గుర్తింపు సాధించాడు. అతడి ఖాతాలో 9 ఉండగా.. రాహుల్ 7 సెంచరీతో నాలుగో ప్లేస్‌లో నిలిచాడు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) 8, యువకెరటం అభిషేక్ శర్మ(Abhishek Sharma) 7 సెంచరీలతో వరుసగా 2, 3 స్థానాల్లో కొనసాగుతున్నారు.
KL Rahul, the fastest Indian to 8,000 men’s T20 runs ⚡ pic.twitter.com/FKnd64aqTS
— ESPNcricinfo (@ESPNcricinfo) May 18, 2025