Rs 20 Notes | త్వరలో మహాత్మా గాంధీ సిరీస్ (కొత్త) రూ.20 నోట్లను విడుదల చేయనుంది. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. కొత్త నోట్లపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో రానున్నాయి. ఈ నోట్ల డిజైన్ మహాత్మా గాంధీ సిరీస్ (కొత్త) రూ.20 నోట్ల మాదిరిగానే ఉంటుంది. గతంలో సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన అన్ని రూ.20 నోట్లు చట్టబద్ధంగా చెలామణిలో ఉంటాయని ఆర్బీఐ ఓ నోటిఫికేషన్లో తెలిపింది. కొత్త గవర్నర్ సంతకంతో కొత్త నోట్లను జారీ చేయడం అనేది ఆర్బీఐ అధినాయకత్వం మార్పు తర్వాత సాధారణంగా జరిగే ప్రక్రియేనని చెప్పింది. ఇది ప్రస్తుత కరెన్సీ నోట్ల వినియోగం, విలువను ప్రభావితం చేయదని స్పష్టం చేసింది.