IPL 2025 : ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) బ్యాటర్లు గర్జించారు. ఓపెనర్ కేఎల్ రాహుల్(112 నాటౌట్) సూపర్ సెంచరీతో జట్టుకు కొండంత స్కోర్ అందించాడు. గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన రాహుల్ బౌండరీలతో విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్లో తనకు తిరుగలేదని చాటుతూ ఐదో సెంచరీ సాధించాడు. అతడికి అభిషేక్ పొరెల్(30) సహకరించగా.. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్(21 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. దాంతో ఢిల్లీ 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసి ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
డబుల్ హెడర్ రెండో మ్యాచ్‌లో టాస్ ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే షాక్. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ ఫాఫ్ డూప్లెసిస్(5) అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో బంతిని మిడిల్ చేయలేక వెనుదిరిగాడు. దాంతో, 16 వద్దే ఢిల్లీ తొలి వికెట్ పడింది. పవర్ ప్లేలో గుజరాత్ టైటాన్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా.. ఓపెనర్ కేఎల్ రాహుల్(112 నాటౌట్) ధాటిగా ఆడాడు. 5 ఫోర్లు, 2 సిక్సర్లతో గుజరాత్ బౌలర్లకు దడ పుట్టించాడు. తన దూకుడైన ఆటతో గుజరాత్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టిన రాహుల్ కుర్రాడు అభిషేక్ పొరెల్(30)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. 6 ఓవర్లకువికెట్ నష్టానికి 45 పరుగులు చేసిన ఢిల్లీ.. రాహుల్ గేర్ మార్చడంతో భారీ స్కోర్ వైపు సాగింది.
𝙎𝙩𝙖𝙣𝙙 𝙪𝙥 𝙖𝙣𝙙 𝘼𝙥𝙥𝙡𝙖𝙪𝙙 👏
An innings of the highest caliber from KL Rahul 🫡
Updates ▶ https://t.co/4flJtatmxc #TATAIPL | #DCvGT | @DelhiCapitals | @klrahul pic.twitter.com/rV2aWxxJZk
— IndianPremierLeague (@IPL) May 18, 2025
గుజరాత్ స్పిన్నర్లు రషీద్ ఖాన్, సాయి కిశోర్‌లను సమర్ధంగా ఎదుర్కొన్న రాహుల్ టాప్ గేర్‌లో ఆడాడు. తాను ట్రబుల్ షూటర్ అని చాటుతూ బౌండరీలో విధ్వంస సృష్టించాడు. రషీద్ వేసిన 10 వ ఓవర్లో బౌండరీతో అర్ధ శతకానికి చేరువయ్యాడు రాహుల్. మరోవైపు అభిషేక్ సైతం దూకుడు పెంచగా గుజరాత్ సారథి శుభ్‌మన్ గిల్‌కు రెండో వికెట్‌కు 90 పరుగులు జోడించిన ఈ జోడీని సాయికిశోర్ విడదీశాడు. అయితే.. అక్షర్ పటేల్(25) 4, 6 బాదగా ఢిల్లీ స్కోర్ 150కి చేరింది. ధాటిగా ఆడుతున్న అక్షర్ ప్రసిధ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్(21 నాటౌట్) తనదైన స్టయిల్లో రెచ్చిపోయాడు.
Partnership broken, courtesy Sai Kishore 👊
Abishek Porel departs as #DC skipper Axar Patel joins KL Rahul in the middle!
The hosts are 136/2 after 15 overs.
Updates ▶ https://t.co/4flJtatmxc #TATAIPL | #DCvGT | @gujarat_titans pic.twitter.com/NNSUULDpxz
— IndianPremierLeague (@IPL) May 18, 2025
సాయి కిశోర్ వేసిన 18వ ఓవర్లో భారీ సిక్సర్ బాదాడు. అనంతరం.. ప్రసిధ్ ఓవర్లో సిక్సర్‌తో 98కి చేరువైన రాహుల్.. బౌండరీతో శతకం సాధించాడు. అనంతరం సిరాజ్‌కు థర్డ్‌మన్, ఎక్స్ట్రా కవర్లో ఫోర్ కొట్టాడు. స్టబ్స్ నాలుగో బంతిని స్టాండ్స్‌లోకి పంపించాడు. దాంతో, ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 199 పరుగులు చేసింది. సుదర్శన్, గిల్, బట్లర్, రూథర్ఫొర్డ్లతో బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన గుజరాత్ లక్ష్యాన్ని ఛేదిస్తే ప్లే ఆఫ్స్‌కు చేరుకోనుంది.