Shehbaz Sharif | ఇస్లామాబాద్: భారత్‌తో నాలుగు రోజుల యుద్ధం తర్వాత జ్ఞానోదయం అయ్యిందో ఏమో కానీ.. పాకిస్థాన్ ప్రధాని హెహబాజ్ షరీఫ్ శాంతి మంత్రం పఠించారు. చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని కొత్త పల్లవి అందుకున్నారు. రెండు దేశాల మధ్య మూడుసార్లు యుద్ధం జరిగినా సాధించినదేమీ లేదంటూ వైరాగ్యాన్ని ప్రదర్శించారు. శుక్రవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ‘మన సమస్యలు పరిష్కారం కాకుండా జమ్ముకశ్మీర్‌లో శాంతి సాధ్యపడదు’ అని స్పష్టం చేశారు.
భారత్-పాకిస్థాన్ యుద్ధంలో తమ దేశంపై భారత్ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించిన విషయం సాక్షాత్తూ ఆ దేశమే నిర్ధారించింది. తమ నూర్ఖాన్ ఎయిర్‌బేస్, దేశంలోని ఇతర ప్రదేశాలు లక్ష్యంగా భారత్ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించి ధ్వంసం చేసిందని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు. ఈ సందర్భంగా ఆ రోజు జరిగిన ఘటనలను గుర్తుకు తెచ్చుకున్నారు.