IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో థ్రిల్లింగ్ మ్యాచ్. విజయం ఇరుజట్లతో దోబూచులాడిన వేళ.. చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ మురిసింది. స్వల్ప ఛేదనలో ఆద్యంతం ఉత్కంఠ నెలకొన్నప్పటికీ ముంబై ఇండియన్స్‌ను 4 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(53) అర్ధ శతకంతో మంచి పునాది వేయగా.. ఓపెనర్ రచిన్ రవీంద్ర(65 నాటౌట్) ఆఖరి వరకూ నిలబడి విజయతీరాలకు చేర్చాడు. స్పిన్నర్ విఘ్నేశ్ పుతుర్ కట్టుదిట్టంగా బంతులు వేసినా.. రెండు సిక్సర్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు రచిన్. దాంతో, సీఎస్కే తమ గెలుపుతో టోర్నీని ఆరంభించింది.
ముంబై నిర్దేశించిన స్వల్ప ఛేదనలో చెన్నై ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. ఓపెనర్ రాహుల్ త్రిపాఠి(2) నిరాశపరచగా.. రచిన్ రవీంద్ర(65 నాటౌట్) క్రీజులో పాతుకుపోయాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(53) అండగా స్కోర్ బోర్డును ఉరికించాడు. సెట్ అయ్యాక దంచేసిన గైక్వాడ్ అర్ధ శతకం బాదేయడంతో సీఎస్కే విజయం నల్లేరు మీద నడకే అనిపించింది. కానీ, యంగ్ స్పిన్నర్ విఘ్నేశ్ పుతూర్(3-32) మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చేశాడు. స్లో డెలివరీలతో అతడు.. వరుసగా గైక్వాడ్, శివం దూబే(9), దీపక్ హుడా(3)లను బోల్తా కొట్టించాడు.
𝘼 𝙙𝙧𝙚𝙖𝙢 𝙙𝙚𝙗𝙪𝙩 ✨
Twin strikes from the young Vignesh Puthur sparks a comeback for #MI 💙
Updates ▶️ https://t.co/QlMj4G7kV0#TATAIPL | #CSKvMI | @mipaltan pic.twitter.com/DKh2r1mmOx
— IndianPremierLeague (@IPL) March 23, 2025
దాంతో 10 ఓవర్లకు 96-3తో పటిష్ట స్థితిలో నిలిచిన చెన్నై 111కే 5 ప్రధాన వికెట్లు కోల్పోయింది. పిచ్ స్పిన్‌కు అనుకూలించడంతో విల్ జాక్స్ .. నమన్ ధార్లు సీఎస్కే బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. అయితే.. రవీంద్రకు జోడీగా రవీంద్ర జడేజా(17) గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్నాడు. సింగిల్స్, డబుల్స్ తీస్తూ లక్ష్యాన్ని కరిగించాడు. విఘ్నేశ్ వేసిన 18వ ఓవర్లో సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రచిన్.. ఆఖరి బంతిని స్టాండ్స్‌లోకి పంపి జట్టును గెలుపు వాకిట నిలిపాడు. జడ్డూతో కలిసి ఆరో వికెట్‌కు 36 రన్స్ జోడించాడీ ఓపెనర్. 19వ ఓవర్లో జడేజా రనౌట్ కావడంతో క్రీజులోకి ధోనీరాగా సిక్సర్‌తో చెన్నైని గెలిపించాడు రవీంద్ర.
𝙁𝙞𝙣𝙞𝙨𝙝𝙞𝙣𝙜 𝙬𝙞𝙩𝙝 𝙖 𝘽𝘼𝙉𝙂 💪
Rachin Ravindra takes #CSK to a win over #MI with a brilliant maximum 💛
Scorecard ▶ https://t.co/QlMj4G7kV0#TATAIPL | #CSKvMI | @ChennaiIPL pic.twitter.com/rVjsGQOHyD
— IndianPremierLeague (@IPL) March 23, 2025
చెపాక్‌లో ముంబై ఇండియన్స్ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు విజృంభించగా ముంబై ప్రధాన ఆటగాళ్లు చేతులెత్తేశారు. రోహిత్ శర్మ(0) డకౌట్ కావడంతో.. పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయిన ఆ జట్టును యువకెరటం తిలక్ వర్మ(31), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(29)లు ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 41 పరుగులు జోడించారు. అయితే.. మిడిల్ ఓవర్లలో నూర్ అహ్మద్(4-18) తిప్పేయగా వీళ్లిద్దరూ పెవిలియన్ చేరడంతో మళ్లీ కష్టాల్లో పడింది ముంబై. ఆ దశలో దీపక్ చాహర్(28 నాటౌట్), మిచెల్ శాంట్నర్(17), లు ధనాధన్ ఆడి సూర్య బృందానికి పోరాడగలిగే స్కోర్ అందించారు. వీళ్లిద్దరూ డెత్ ఓవర్లలో బ్యాట్ ఝులిపించడంతో నిర్ణీత ఓవర్లలో ముంబై 155 పరుగులు చేసింది.