IPL 2025 : ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం దిశగా సాగుతోంది. స్వల్ప ఛేదనలో రుతురాజ్ గైక్వాడ్(53) అర్ధ శతకంతో జట్టు విజయానికి పునాది వేశాడు. అయితే.. స్పిన్నర్ విఘ్నేశ్ పుతుర్ ఓవర్లో భారీ షాట్ ఆడే క్రమంలో ఔటయ్యాడు. దాంతో, చెన్నై 78 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ కాసేపటికే డేంజరస్ శివం దూబే(9)ను సైతం విఘ్నేశ్ వెనక్కి పంపాడు.
ప్రస్తుతం ఓపెనర్ రచిన్ రవీంద్ర (26, దీపక్ హుడా(1)లు క్రీజులో ఉన్నారు. 10 ఓవర్లకు స్కోర్.. 96-3. సీఎస్కే విజయానికి 60 బంతుల్లో 60 పరుగులు కావాలి. మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు విజృంభించగా ముంబై ప్రధాన ఆటగాళ్లు చేతులెత్తే|శారు. పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయిన ఆ జట్టును యువకెరటం తిలక్ వర్మ(31), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(29)లు ఆదుకున్నారు. మిడిల్ ఓవర్లలో నూర్ అహ్మద్(4/18) తిప్పేయగా మళ్లీ కష్టాల్లో పడిన ముంబైకి దీపక్ చాహర్(28 నాటౌట్), మిచెల్ శాంట్నర్(17), లు పోరాడగలిగే స్కోర్ అందించారు.