IPL 2025 : ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఐపీఎల్లో సెంచరీ చేయాలని ప్రతి బ్యాటర్ కల కంటాడు. అయితే.. తనదే మొదటి శతకం అయిందనుకోండి.. వాళ్ల సంతోషం రెండితలవుతుంది. ప్రస్తుతం సన్‌రైజర్స్ స్టార్ ఇషాన్ కిషన్ అదే ఉత్సాహంతో ఉన్నాడు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్లో ఇషాన్ మాదిరిగానే పలువురు పరుగుల వరద పారిస్తున్నారు. పవర్ హిట్టర్లు బ్యాట్లతో విధ్వంసం సృష్టిస్తున్నారు.
డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుల మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన స్టార్ ఆటగాళ్లు అర్థ శతకాలతో అలరించగా.. రెండో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ సెంచరీతో కదం తొక్కాడు. ఈ సీజన్లో మొదటి వంద కొట్టిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడీ లెఫ్ట్ హ్యాండర్. తద్వారా ఐపీఎల్ ఎడిషన్‌లో తొలి శతకం నమోదు చేసిన అరుదైన క్లబ్లో చోటు సంపాదించాడు ఇషాన్. గత 17 సీజన్లలో మొదటిసారి మూడంకెల స్కోర్ కొట్టిన ఆటగాళ్లు ఎవరో తెలుసా..?
𝙄.𝘾.𝙔.𝙈.𝙄 🔥
Ishan Kishan dealt in sixes on his way to a magnificent maiden #TATAIPL 💯 😮 👊
Updates ▶ https://t.co/ltVZAvHPP8#SRHvRR | @SunRisers | @ishankishan51 pic.twitter.com/9PjtQK231J
— IndianPremierLeague (@IPL) March 23, 2025
ఐపీఎల్ ఆరంభ సీజన్లో తొలి సెంచరీ వీరుడు బ్రెండన్ మెక్కల్లమ్. రాయల్ చాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ చిచ్చరపిడుగు మ్యాచ్‌లో 158 నాటౌట్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాతి ఎడిషన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఏబీ డివిలియర్స్ సెంచరీ కొట్టాడు. 2010లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యూసుఫ్ పఠాన్ వందతో చెలరేగాడు. 2011లో మొదటి వంద బాదిన క్రికెటర్‌గా పాల్ వాల్తాటి(కింగ్స్ లెవన్ పంజాబ్ ) రికార్డు నెలకొల్పాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు అజింక్యా రహానే 2012లో, షేన్ వాట్సన్ 2013లో తొలి శతకంతో మెరిశారు. లెండిల్ సిమన్స్ 2014 సీజన్లో నూరు పరుగులతో అలరించాడు.
𝐌𝐞𝐞𝐭 𝐭𝐡𝐞 𝐅𝐢𝐫𝐬𝐭 𝐂𝐞𝐧𝐭𝐮𝐫𝐢𝐨𝐧 𝐨𝐟 𝐈𝐏𝐋 𝟐𝟎𝟐𝟓 – 𝐈𝐬𝐡𝐚𝐧 𝐊𝐢𝐬𝐡𝐚𝐧! 🔥
A maiden IPL ton for the Orange Army’s explosive left-hander! 💯🧡 What a fabulous knock to kick off the season in style! 👏#IshanKishan #IPL2025 #Century #SRH #Sportskeeda pic.twitter.com/H4XFVOGn8A
— Sportskeeda (@Sportskeeda) March 23, 2025
మెక్కల్లమ్ మరోసారి తన బ్యాట్ పవర్ చూపిస్తూ 2015లో వందతో విజృంభించగా.. ఆ తర్వాతి సీజన్లలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ బ్యాటర్లు క్వింటన్ డికాక్, సంజూ శాంసన్‌లు ఫస్ట్ సెంచరీ సాధించారు. 2018లో కింగ్స్ లెవన్ పంజాబ్ తరఫున ఆడిన క్రిస్ గేల్ వందతో విరుచుకుపడగా.. ఆ తర్వాత రాజస్థాన్ ఆటగాడిగా బరిలోకి దిగిన శాంసన్ మళ్లీ ఫస్ట్ సెంచరీ వీరుడిగా నిలిచాడు. 2020లో కింగ్స్ లెవెన్ పంజాబ్ ప్లేయర్‌గా కేఎల్ రాహుల్.. ఆ తర్వాత రాజస్థాన్ తరఫున శాంసన్ వందతో చెలరేగారు. 15వ సీజన్లో జోస్ బట్లర్ తొలి శతకం సాధించగా.. 2023లో సన్‌రైజర్స్ తరఫున హ్యారీ బ్రూక్ సెంచరీతో చెలరేగాడు. 17వ సీజన్లో విరాట్ కోహ్లీ మూడంకెల స్కోర్ చేయగా.. 18వ సీజన్లో ఇషాన్ కిషన్ తొలి సెంచరీతో రికార్డు పుస్తకాల్లో చోటు దక్కించుకున్నాడు.