Rohit Sharma | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య మూడో మ్యాచ్ మొదలైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మ్యాచ్ కొనసాగుతున్నది. టాస్ గెలిచిన సీఎస్కే కెప్టెన్ రితురాజ్ గైక్వాడ్.. బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్ శర్మకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో హిట్‌మ్యాచ్ ఓ చెత్త రికార్డును నెలకొల్పాడు. ఐపీఎల్ అత్యధిక సార్లు డకౌట్‌గా వెనుదిరిగిన ప్లేయర్‌గా నిలిచాడు.
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు 18సార్లు ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేష్ కార్తిక్ రికార్డును సమం చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు మ్యాక్స్‌వెల్, దినేష్ కార్తిక్ పేరిట ఉండగా.. తాజాగా ఈ జాబితాలో రోహిత్ శర్మ సైతం చేరాడు. ఆ తర్వాత పీయుష్ చావ్లా, సునీల్ నరైన్ ఇద్దరూ 16 సార్లు డకౌట్‌గా వెనుదిరిగారు. ఇదిలా ఉండగా.. చెన్నైతో మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా దూరమైన విషయం తెలిసిందే. తర్వాత మ్యాచ్‌కు హార్దిక్ అందుబాటులో ఉంటాడని రోహిత్ తెలిపాడు. బుమ్రా జట్టుతో చేరేందుకు సమయం పడుతుందని పేర్కొన్నారు. వారి స్థానాల్లో కొత్తగా ఇద్దరు ఆటగాళ్లు అవకాశం లభించింది.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు : రితురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, శివం దుబే, రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, ఖలీల్ అహ్మద్.
ఇంపాక్ట్ ప్లేయర్స్: రాహుల్ త్రిపాఠి, కమలేష్ నాగర్కోటి, విజయ్ శంకర్, జామీ ఓవర్టన్, షేక్ రషీద్.
ముంబయి ఇండియన్స్ : రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, రాబిన్ మింజ్, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజు.
ఇంపాక్ట్ ప్లేయర్స్ : విఘ్నేష్ పుత్తూర్, అశ్విని కుమార్, రాజ్ బావా, కార్బిన్ బాష్, కర్ణ్ శర్మ