IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ తొలి మ్యాచ్‌లో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు విజృంభించగా ముంబై ప్రధాన ఆటగాళ్లు చేతులెత్తేశారు. పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయిన ఆ జట్టును యువకెరటం తిలక్ వర్మ(31), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(29)లు ఆదుకున్నారు. డెత్ ఓవర్లలో దీపక్ చాహర్(28 నాటౌట్), మిచెల్ శాంట్నర్(11), లు బ్యాట్ ఝులిపించడంతో నిర్ణీత ఓవర్లలో ముంబై 155 పరుగులు చేసింది. ఈ సమ ఉజ్జీల పోరాటంలో విజయం ఎవరిని వరిస్తుందో మరికొన్ని నిమిషాల్లో తేలిపోనుంది.
చెపాక్ స్టేడియంలో సూపర్ కింగ్స్ బౌలర్లు తడాఖా చూపించారు. ముంబై ఇండియన్స్ బ్యాటర్ల జోరుకు పగ్గాలు వేస్తూ .. ఆ జట్టును లో స్కోర్‌కే కట్డడి చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి శుభారంభం దక్కలేదు. చాంపియన్స్ ట్రోఫీలో దంచికొట్టిన రోహిత్ శర్మ సున్నాకే ఖలీల్ అహ్మద్‌కు వికెట్ ఇచ్చేశాడు. ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన.. రియాన్ రికెల్టన్(13)ను 0 బౌల్డ్ చేసిన ఖలీల్ ముంబైని కోలుకోలేని దెబ్బ కొట్టాడు.
Blink and you miss! 😮
A lightning-quick stumping from MS Dhoni gives #CSK the huge wicket of Surya Kumar Yadav 👏
Updates ▶ https://t.co/QlMj4G7kV0#TATAIPL | #CSKvMI | @ChennaiIPL | @msdhoni pic.twitter.com/XDVZf8qxXI
— IndianPremierLeague (@IPL) March 23, 2025
అంతలోనే బంతి అందుకున్న అశ్విన్ తన స్పిన్ మ్యాజిక్ చూపిస్తూ.. డేంజరస్ విల్ జాక్స్(11)ను పెవిలియన్ పంపాడు. అంతే.. చూస్తుండగానే 36 పరుగులకే ముగ్గురు ప్లేయర్లు డగౌట్ బాట పట్టారు. ఆ దశలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(29), తిలక్ వర్మ(31)లు ఇన్నింగ్స్ నిర్మించారు. నాలుగో వికెట్‌కు 41 పరుగులు జోడించారు. అయితే.. నూర్ అహ్మద్ (4-18) వీళ్లిద్దరిని పెవిలియన్ పంపి ముంబైని మరింత కష్టాల్లోకి నెట్టాడు. నలభైల్లోనూ వికెట్ కీపింగ్‌లో కుర్రాళ్లను తలపిస్తున్న ధోనీ.. మెరుపు స్టంపింగ్‌తో సూర్యను పెవిలియన్ పంపాడు.
నూర్ అహ్మద్ విజృంభణతో 96 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ముంబై స్కోర్ 120 దాటడమే కష్టమనిపించింది. ఆ పరిస్థితుల్లో నమన్ ధార్(17), దీపక్ చాహర్(28 నాటౌట్)లు ధనాధన్ ఆడి చెన్నై బౌలర్లపై ఒత్తిడి పెంచారు. ఆఖరి ఓవర్లలో బౌండరీలతో విరుచుకుపడ్డ చాహర్ జట్టు స్కోర్ 150 దాటించాడు. 20వ ఓవర్లో రన్స్ రావడంతో ముంబై ప్రత్యర్థికి లక్ష్యం నిర్ధేశించగలిగింది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు ముంబై బౌలర్లు శ్రమించక తప్పదు.