టేకులపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం గంగారం సమీపంలో రోడ్డు ప్రమాదంలో ( Accident ) ఓ యువకుడు మృతి చెందాడు. మండలంలోని లచ్చగూడెం గ్రామానికి చెందిన కోర్స రాంబాబు (30) అనే యువకుడు లచ్చగూడెం నుంచి ద్విచక్రవాహనంపై ఆళ్లపల్లి వెళుతుండగా గంగారం సమీపంలో ఎదురుగా వచ్చిన ఐస్ క్రీమ్ బండి ( Ice cream ) ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు గ్రామస్థుల తెలిపారు. బోడు పోలీసులు సంఘటనానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య కళ్యాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు.