Khammam Victims | పొంగులేటిని చెప్పులతో కొట్టి ఉరికిస్తాం.. భట్టి విక్రమార్క నీకు సిగ్గు శెరముండాలె.. ఖమ్మం బాధితుల ఆవేదన
Khammam Victims | మున్సిపల్ ఎన్నికలు కూడా అయిపోయాయి ఇంక మా అవసరం లేదని ఇండ్లు కూల్చేశారని.. రేవంత్ రెడ్డి మాకు న్యాయం చేయకపోతే ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తామని ఖమ్మం కూల్చివేతల్లో ఇళ్లు కోల్పోతున్న బాధితులు హెచ్చరించారు.
Khammam Victims | కాంగ్రెస్ సర్కార్ ఆదేశాలతో ఖమ్మం నగరంలోని వెలుగుమట్ట వినోబానగర్‌లో పేదల ఇండ్లను కూల్చివేసేందుకు అధికారులు, పోలీసులు బుల్డోజర్లతో రంగంలోకి దిగారు. ఎనిమిదేండ్లుగా ఇక్కడ నివాసముంటున్నా తమకు ఎలాంటి సమాచారం లేకుండా ఖాళీ చేయిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేశాం.. కానీ మాకేం చేయకుండా మా ఇల్లు లాక్కొని కూల్చేశారని ఖమ్మం బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలు కూడా అయిపోయాయి ఇంక మా అవసరం లేదని ఇండ్లు కూల్చేశారని.. రేవంత్ రెడ్డి మాకు న్యాయం చేయకపోతే ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తామని హెచ్చరించారు.
పట్టీలు, బంగారం మున్సిపాలిటీవాళ్లు తీసుకుపోయారు..
ఈ సారి ఓట్లడగడానికి వస్తే చెప్పులు తీసుకొని కొడతాం.. అంటూ హెచ్చరిస్తున్నారు. దీని వెనకాల తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డి హస్తం ఉంది. మాకు కూలగొడతామని సమాచారం కూడా ఇయ్యకుండా మొత్తం ప్రొక్లెయినర్లను తీసుకొచ్చి కూల్చారు. నావైతే సామాను తీసుకునే దాకా కూడా ఆగలేదు. నావైతే 10 తులాల పట్టీలు, అరతులం బంగారం మొత్తం మున్సిపాలిటీవాళ్లు తీసుకునిపోయారు . ఓ వైపు ప్రజా పాలన మహిళలను కోటీశ్వరులను చేస్తామంటున్నరు.. కదా అని అంటే..? ఏది రేవంత్ రెడ్డి దినం చేయడానికి మాకేది.. మాకేం న్యాయం చేసిండు వాడు. ఏడ కాలిందో వాడి కడుపు మాకైతే రూపాయి సాయం లేదంటూ దుమ్మొత్తిపోశారు.
స్థానిక మహిళ మాట్లాడుతూ.. భట్టివిక్రమార్క.. నీకు సిగ్గు శెరముండాలె.. వీళ్ల ఏడుపులు తగులుతయి.. ఈ గడ్డ నీ ఊరు పక్కనే ఉంది. ఇంతమంది ఏడుస్తుంటే నీకు సిగ్గనిపిస్తలేదా..? పేరు భట్టివిక్రమార్క అని పెట్టుకున్నవ్ ఎందుకు..? పేరుకు తగ్గ జీవితం జీవించాలి. అడ్గగోలుగా జీవించడం కాదు.. నాలుగు రోజులు నందిలా బతికినా సరే.. పందిలా బతుకొద్దు. మాకు ఇల్లు లేదు.. వాకిలి లేదు.. పోని మా ఆధార్ కార్డులు తీసి మాకేమైనా స్థిరాస్తులు, పదెకరాలు, 20 ఎకరాలు ఉంది అంటే మేం ఒప్పుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎన్నికలప్పుడు మా కాళ్ళు పట్టుకున్నారు..
రేవంత్ రెడ్డి ఇట్ల చేస్తడనుకోలేదని ఇల్లు కోల్పోయిన బాధిత మహిళ కన్నీరుమున్నీరైంది. గుడిసెలు వేసినప్పుడే మీకు ఇక్కడ ఉండే అర్హత లేదమ్మా అంటే మేం సంతోషంగా వెళ్లిపోయే వాళ్లం… అక్కడ ఇల్లు ఉన్నదాన్ని అమ్ముకొని ఇక్కడ మంచి చోటు కలెక్టర్ ఆఫీస్ దగ్గర మంచిగుంటదని కట్టుకున్నం. ఇయ్యాళ్ల ఇట్లా కూలగొడతడని మేం అస్సలు అనుకోలేదంటూ మరో బాధిత మహిళ కన్నీటి పర్యంతమైంది.
ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని చెప్పులు తీసుకొని కొట్టి ఉరికిస్తామంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ రాజ్యం వచ్చింది.. దొంగ రాజకీయం అయింది.. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికలప్పుడు మా కాళ్ళు పట్టుకున్నారు.. ఇప్పుడు మాకు కర్రబెట్టి గుచ్చారని మండిపడ్డారు.
బాధితుల ఆవేదన ఇలా..
కాంగ్రెస్ పార్టీ పెద్ద లంగ పార్టీ.. లుచ్చా పార్టీ
భట్టి విక్రమార్క ఇంత మంది ఏడుస్తుంటే నీకు సిగ్గనిపిస్తలేదా?
మా ఏడుపు తగిలి నాశనం అవుతారు
ఎనకటికి ఒకడు గుర్రాలు తొక్కించి ప్రాణాలు తీశాడు.. ఇప్పుడు అట్లనే మమ్మల్ని చంపి మా రక్తం మీదగా నడుచుకుంటూ పోండి
రేవంత్ రెడ్డి ఇంత… https://t.co/4P50LMYFQn pic.twitter.com/ncitV7xUkc
— Telugu Scribe (@TeluguScribe) February 25, 2026
ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని చెప్పులు తీసుకొని కొట్టి ఉరికిస్తాం
కాంగ్రెస్ రాజ్యం వచ్చింది దొంగ రాజకీయం అయింది
రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికలప్పుడు మా కాళ్ళు పట్టుకున్నారు.. ఇప్పుడు మాకు కర్రబెట్టి గుచ్చారు… https://t.co/dnr29YKnFd pic.twitter.com/7z8Cz7v9mK
— Telugu Scribe (@TeluguScribe) February 25, 2026
ఈసారి ఓట్ల కోసం వస్తే మా చెప్పులు తీసుకొని కొడుతాము ల*జా కొడుకులను
దీని వెనక తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి, రేవంత్ రెడ్డి హస్తం ఉంది
కనీసం మా సామాన్లు తీసుకుంటామన్న కూడా ఆగలేదు.. ఇంట్లో ఉన్న బంగారం కూడా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుపోయారు
రేవంత్ రెడ్డికి దినం చేయా.. మాకు… https://t.co/LTLIUMO8jz pic.twitter.com/D4Lm3cGRHY
— Telugu Scribe (@TeluguScribe) February 25, 2026
Read Also :
Virosh | చదువులోనూ టాపర్స్… స్టార్ కపుల్ విజయ్ – రష్మిక ఎడ్యుకేషన్ డిటేల్స్ వైరల్
Virosh Star Kids | నటన వద్దు.. దర్శకత్వమే ముద్దు: మెగా ఫోన్ పడుతున్న స్టార్ కిడ్స్!
Ayasher Song | నాని ‘ఆయాషేర్’ దెబ్బకి పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్’ ఔరా గల్లంతు!
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Former MLA Gandra | చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన : మాజీ ఎమ్మెల్యే గండ్ర
Premada Oorali | రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమా,బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు.. ‘ప్రేమద ఊరాలి’ సంచలనం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

