కోదాడ, ఫిబ్రవరి 25 : కిట్స్ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం సూర్యా టెక్ సొల్యూషన్ ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. ఈ ప్లేస్మెంట్లో 14 మంది ఇంజినీరింగ్ విద్యార్థినులు, అలాగే మరో 14 మంది డిప్లొమా విద్యార్థినులు ఉద్యోగ అవకాశాలు పొందారు. ఆ కంపెనీ ప్రాజెక్ట్ డైరెక్టర్ టిఎస్ ప్రవీణ్, హెచ్ఆర్ అనిల్ నేతృత్వంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. ఒక్కొక్కరికి వార్షిక వేతనం రూ.4.50 లక్షలుగా పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థినులు కళాశాల చైర్మన్ నీర సత్యనారాయణ. ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ గాంధీ, డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రావు అభినందించారు.