Malaysia Masters : ప్రతిష్ఠాత్మక మలేషియా మాస్టర్స్‌లో గురువారం భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో స్టార్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ (Kidambi Srikanth) క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఐర్లాండ్ ఆటగాడు నాట్ గుయెన్‌ను చిత్తుగా ఓడించాడీ మాజీ వరల్డ్ నంబర్ 1. మిక్స్డ్ డబుల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్లోధ్రువ్ కపిల, తనీషా క్రాస్టో ద్వయం అదరగొట్టింది. అయితే.. కుర్రాళ్లు హెచ్ఎస్ ప్రణయ్ (HS Prannoy), ఆయుశ్ శెట్టి, కరుణాకరన్‌లకు మాత్రం చుక్కెదురైంది.
మాజీ నంబర్ 1 శ్రీకాంత్ రెండో రౌండ్లోనూ దుమ్మురేపాడు. తొలి రౌండ్లో లూ గాంజ్ జూ(చైనా)ను చిత్తు చేసిన భారత ఆటగాడు గురువారం కూడా అదే జోరు చూపించాడు. 33వ ర్యాంకర్ అయిన గుయెన్‌కు చుక్కలు చూపించాడు. హోరాహోరీగా సాగిన తొలి సెట్‌ను 23-21తో గెలుచుకున్న శ్రీకాంత్.. రెండో సెట్లో మరింత చెలరేగాడు.
What A Win For Srikanth Kidambi 🚨
Man, this is so emotional 🥲 and exciting. The former World no1 coming all the way from qualifying in a BWF500 #MalaysiaMasters has now entered Quarterfinal https://t.co/sWFVcKzk9s pic.twitter.com/JmomVKx0eK
— IndiaSportsHub (@IndiaSportsHub) May 22, 2025
దాంతో, ప్రత్యర్థి వెనకబడగా.. 21-17తో భారత స్టార్ క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టాడు. మిక్స్డ్ డబుల్స్‌లో ధ్కువ్ కపిల, తనీషా క్రాస్టో ద్వయం అద్భుతంగా ఆడింది. ఫ్రాన్స్‌కు చెందిన జులియన్ మయివో లీ పలెమోపై మూడు సెట్ల పోరులో 21-17, 18-21, 21-15తో అలవోకగా గెలుపొందింది.
మలేషియా మాస్టర్స్‌లో ఫేవరెట్‌గా అడుగుపెట్టిన ప్రణయ్‌కు జపాన్ కుర్రాడు చెక్ పెట్టాడు. క్వార్టర్ ఫైనల్ పోరులో యుషి తనక ధాటికి చేతులెత్తేసిన భారత సంచలనం.. 9-21, 18-21తో ఓటమి పాలయ్యాడు. ఫ్రాన్స్ షట్లర్లు తొమా పొపోవ్ జోరకు ఆయుశ్ శెట్టి తలవంచగా .. క్రిస్టో పొపొవో చేతిలో కరుణాకరన్‌కు పరాజయం ఎదురైంది. మహిళల 16వ రౌండ్ డబుల్స్ మ్యాచ్‌లో ప్రేరణా అల్వేకర్, మృణ్మయి దేశ్‌పాండే ద్వయం విఫలమైంది. ఒలింపిక్ విజేత పీవీ సింధు తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే.
ప్రణయ్