WI vs SA : సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన వెస్టిండీస్(West Indies) టీ20 సిరీస్‌లో గర్జించింది. బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో నికోలస్ పూరన్ (65 నాటౌట్ ) విధ్వంసంతో విండీస్ భారీ విజయం సాధించింది. సఫారీలు నిర్దేశించిన 175 పరుగుల ఛేదనలో కరీబియన్ చిచ్చరపిడుగు పూరన్ రెచ్చిపోయాడు. సిక్సర్ల వర్షంతో ప్రొటిస్ బౌలర్లను ఉతికేసి జట్టును గెలిపించాడు. దాంతో, 7 వికెట్ల తేడాతో గెలుపొందిన వెస్టిండీస్ సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది.
ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో మొదట ఆడిన దక్షిణాఫ్రికా 174 రన్స్ కొట్టింది. యువకెరటం ట్రిస్టన్ స్టబ్స్(76) హాఫ్ సెంచరీకి తోడు లోయర్ ఆర్డర్లో ప్యాట్రిక్ క్రుగెర్(44) దంచడంతో పర్యాటకు జట్టు భారీ టార్గెట్ నిర్దేశించింది. ఛేదనలో విండీస్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్ అలిక్ అథనజె(40), షా హోప్(51)లు దూకుడుగా ఆడి తొలి వికెట్‌కు 84 పరుగులు జోడించారు.
Player of the match performance from Nicholas Pooran to steer the #MenInMaroon home! 🏏💪🏾#WIvSA #T20Fest pic.twitter.com/xQYbqsLrwm
— Windies Cricket (@windiescricket) August 23, 2024
ఈ ఇద్దరిని బార్ట్‌మన్ వెనక్కి పంపాక వచ్చిన నికోలస్ పూరన్(65 నాటౌట్ 26 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు) సిక్సర్లతో హోరెత్తించాడు. నంద్రె బర్గర్ ఓవర్లో వరుసగా 4 సిక్సర్లు బాదిన పూరన్ అర్ధ శతకంతో జట్టును గెలిపించాడు. ఇరుజట్ల మధ్య రెండో టీ20 ఇదే స్టేడియంలో ఆగస్టు 26న జరుగనుంది.