Nicholas Pooran : పొట్టి ప్రపంచకప్ రెండో దశ ఉత్కంఠగా సాగుతోంది. ఓవైపు లో స్కోర్లు నమోదవుతున్నాహిట్టర్లు మాత్రం సిక్సర్ల మోత మోగిస్తున్నారు. వీళ్లలో వెస్టిండీస్ చిచ్చరపిడుగు నికోలస్ పూరన్ (Nicholas Pooran) రికార్డుల పర్వం లిఖిస్తున్నాడు. తన ఊచకోతతో బౌలర్లను బెంబేలెత్తిస్తూ సంచలనాలు సృష్టిస్తున్నాడు. పవర్ హిట్టర్ పూరన్ తొమ్మిదో సీజన్ ఇప్పటికే 17 సిక్సర్లు బాదాడు. దాంతో, టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్ల వీరుడిగా అవరించాడు.
తద్వారా 12 ఏండ్ల క్రితం యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(Chris Gayle) పేరిట ఉన్న రికార్డును పూరన్ బద్ధలు కొట్టాడు. 2012 వరల్డ్ కప్లో గేల్ ఏకంగా 16 సిక్సర్లతో వార్తల్లో నిలిచాడు. విండీస్కే చెందిన మర్లోన్ శామ్యూల్స్ 15 సిక్సర్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
Nicholas Pooran smashes Chris Gayle’s record for most sixes in a single T20 World Cup.💥
How many more will he add to his tally? pic.twitter.com/IDqmumkHDW
— CricTracker (@Cricketracker) June 22, 2024
1. నికోలస్ పూరన్(వెస్టిండీస్) – 2024లో 17 సిక్సర్లు
2. క్రిస్ గేల్(వెస్టిండీస్) – 2012 ఎడిషన్లో 16 సిక్సర్లు
3. మర్లోన్ శామ్యూల్స్(వెస్టిండీస్) – 2012లో 15 సిక్సర్లు
4. షేన్ వాట్సన్(ఆస్ట్రేలియా) – 2012లో 15 సిక్సర్లు
5. అరోన్ జోన్స్ (అమెరికా) – 2024 ఎడిషన్లో 14 సిక్సర్లు
సొంతగడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్లో పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. లీగ్ దశ చివరి మ్యాచ్లో అఫ్గనిస్థాన్పై సిక్సర్ల వర్షం కురిపించిన అతడు.. అమెరికాపై పూనకం వచ్చినట్టు ఆడాడు. ఎదుర్కొన్న 12 బంతుల్లో మూడు సిక్సర్లు బాది గేల్ ఆల్టైమ్ రికార్డును పూరన్ అధిగమించాడు. తొమ్మిదో సీజన్లో యూఎస్ఏ హిట్టర్ 14 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఈ మెగా టోర్నీ చరిత్రలో టాప్ 5 సిక్సర్ల వీరుల జాబితాలో ముగ్గురూ విండీస్ వాళ్లే ఉండడం విశేషం.