UAE | రేప్ కేసుల్లో అబార్షన్లకు యూఏఈ ఓకే
ఇస్లామిక్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మహిళల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నది.
UAE | న్యూఢిల్లీ, జూన్ 21: ఇస్లామిక్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మహిళల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నది. అత్యాచారం, అక్రమ సంబంధం లాంటి కేసుల్లో అబార్షన్లను అనుమతించేందుకు ఓ తీర్మానాన్ని ఆమోదించింది.
దీని ప్రకారం.. అత్యాచారం లేదా అక్రమ సంబంధం వల్ల గర్భం దాల్చితే దాన్ని తొలగించుకునేందుకు అనుమతి లభిస్తుంది. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 120 రోజుల్లోపు గర్భాన్ని మాత్రమే తొలగించుకునేందుకు వీలు కల్పించారు.
ఈ వార్త తప్పకుండా చదవండి..
రాంగ్ రూట్ వెళ్తున్నారా.. అయితే మీరు మూడేండ్లు జైలుకు వెళ్లాల్సిందే!
- 124 ప్రాంతాల్లో ఏఎన్పీఆర్ కెమెరాలు
- ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్
Wrong Route Driving | సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ): రాంగ్ రూట్ వెళ్తున్నారా తస్మాత్ జాగ్రత్తా…! ఇక నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైలుకు పంపుతారు. ఈ మధ్య కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులే ఉండటంతో ట్రాఫిక్ నియమాలను మరింత కఠినంగా అమలు చేసేందుకు సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే మొదటి సారిగా రాంగ్ రూట్లో ప్రయాణించే వాహనదారులపై 336 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం మొదలు పెట్టారు సైబరాబాద్ పోలీసులు. రాంగ్రూట్లో వచ్చి పట్టుబడిన వారిపై సంబంధిత లా అండ్ ఆర్డర్ ఠాణాలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, చార్జీషీట్ దాఖలు చేస్తారు.
శుక్రవారం ఒక్కరోజే..
శుక్రవారం ఒక్కరోజే కమిషనరేట్ పరిధిలో రాంగ్‌రూట్ వాహనాలు నడిపిన 93 మందిని గుర్తించి కేసులు నమోదు చేశారు. అందులో 11 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. స్టేషన్ల వారీగా పరిశీలిస్తే గచ్చిబౌలి పీఎస్ పరిధిలో అత్యధికంగా 32 మంది రాంగ్రూట్లో ప్రయాణిస్తూ పట్టుపడ్డారు. వారిలో నలుగురిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. కేపీహెచ్‌బీ పీఎస్ పరిధిలో ఐదు మంది పట్టుబడగా, వారిలో ఒకరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కూకట్పల్లి పరిధిలో ముగ్గురు పట్టుబడగా, వారిలో ఒకరిపై, మాదాపూర్‌లో ఆరు మంది పట్టుబడగా, వారిలో ఒకరిపై, నార్సింగి ఠాణా పరిధిలో 11 మంది పట్టుబడగా, వారిలో ఒకరిపై, రాయదుర్గం పరిధిలో 20 మంది పట్టుబడగా, వారిలో ఇద్దరిపై, జీడిమెట్ల పరిధిలో 16 మంది పట్టుబడగా, వారిలో ఒకరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
రాంగ్‌సైడ్ డ్రైవింగ్ ప్రమాదకరం
– జాయింట్ సీపీ(ట్రాఫిక్) జోయల్ డేవిస్
రాంగ్రూట్లో ప్రయాణించడం వల్ల రాంగ్‌సైడ్ వచ్చే వాహనదారులకే కాకుండా ఇతర వాహనదారులు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. రాంగ్‌సైడ్ డ్రైవింగ్ చాలా ప్రమాదకరం. జరిమానాలు వేసినా నిబంధనల ఉల్లంఘనులు తగ్గడం లేదు. అందుకని రాంగ్ రూట్ డ్రైవింగ్‌కు పాల్పడే వాహనదారులపై సెక్షన్ 336 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నాం. ఈ కేసుల్లో మూడేండ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కొన్ని సార్లు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా పడవచ్చు.
రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఇంతకుముందు లేదు. మొదటిసారిగా గత నెలలోనే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాం. గత నెలలో కమిషనరేట్ పరిధిలో మొత్తం 250 వాహనాలపై కేసులు పెట్టాం. కమిషనరేట్ పరిధిలో తరచూ ఎక్కువగా రాంగ్‌రూట్ వెళ్లేందుకు అవకాశాలున్న 124 ప్రాంతాలను గుర్తించాం. ఈ ప్రాంతాల్లో ఏఎన్పీఆర్ కెమెరాలు అమరుస్తున్నాం. ఈ కెమెరాలు రాంగ్‌రూట్ వెళ్లే వారిని గుర్తించి ఫొటోలు తీస్తాయి. వాటి ఆధారంగా నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తాం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి తెలుగు థియేట్రికల్ రైట్స్‌కు రికార్డు ధర.. రూ.290 కోట్లకు కొనుగోలు చేసిన మైత్రి మూవీ మేకర్స్!
Belly Fat | పొత్తి కడుపు కింది భాగంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించే సులభమైన వ్యాయామాలు.. ఇంట్లోనే చేయవచ్చు..
Niranjan reddy | ప్రభుత్వ ఖర్చుతో బర్త్ డే వేడుకలు.. రేవంత్ రెడ్డి ఒక్కడే ఉంటారేమో : నిరంజన్ రెడ్డి
బాలికల పట్ల పారిశుధ్య కార్మికుడి అసభ్య ప్రవర్తన?
Harish Rao | ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటాం : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

