అర్కాన్సాస్: అమెరికాలో కాల్పుల(US Shooting) ఘటన జరిగింది. అర్కాన్సాస్ రాష్ట్రంలోని సూపర్మార్కెట్లో ఓ ఉన్మాది ఫైరింగ్ జరిపాడు. ఆ కాల్పుల్లో ముగ్గురు సాధారణ పౌరులు మృతిచెందగా, మరో 10 మంది గాయపడ్డారు. దీంట్లో ఇద్దరు పోలీసు ఆఫీసర్లు కూడా ఉన్నారు. పోలీసులతో జరిగిన ఫైరింగ్లో అనుమానిత వ్యక్తి కూడా గాయపడినట్లు అర్కాన్సాస్ పోలీసు డైరెక్టర్ మైక్ హగర్ తెలిపారు. ఫోర్డిసీ పట్టణంలోని మాడ్ బుచర్ గ్రోసరీ మార్కెట్లో కాల్పుల ఘటన చోటుచేసుకున్నది. ఆ పట్టణంలో సుమారు నాలుగు వేల జనాభా ఉంటుంది. ఎందుకు ఆ ఉన్మాది కాల్పులకు తెగించాడో ఇంకా స్పష్టంగా తెలియదు. కాల్పులు జరిపిన వ్యక్తిని న్యూ ఎడిన్బర్గ్కు చెందిన 44 ఏళ్ల ట్రావిస్ యూజీన్ పోసీగా గుర్తించారు.