IPL 2025 : పొట్టి క్రికెట్లో ఎప్పుడు ఏ జట్టు చెలరేగి ఆడుతుందో చెప్పలేం. ఐపీఎల్లో రికార్డులు బద్ధలు కొట్టిన టీమ్.. అనూహ్యాంగా ఓటమి పాలవ్వడం చూశాం. తొలి మ్యాచ్‌లోనే రికార్డు స్కోర్ కొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఊహించని షాక్ తగిలింది. తొలి పోరులో రాజస్థాన్ రాయల్స్‌ను 44 పరుగుల తేడాతో ఓడించిన ఆరెంజ్ ఆర్మీ సొంత ఇలాకాలో ఓటమి పాలైంది. టాపార్డర్ వైఫల్యంతో భారీ స్కోర్ కొట్టలేకపోయిన కమిన్స్ సేన.. లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమైంది.
190 పరుగు ఛేదనలో డేంజరస్ నికోలస్ పూరన్(70), ఓపెనర్ మిచెల్ మార్ష్(52)లు విధ్వంసంక అర్థశతకాలతో చెలరేగారు. బౌండరీలతో ఉప్పల్ స్టేడియాన్ని హోరెత్తించిన ఈ ఇద్దరూ లక్నోను గెలుపు దిశగా నడిపారు. అబ్దుల్ సమద్(22నాటౌట్), డేవిడ్ మిల్లర్(13 నాటౌట్)లు ధాటిగా ఆడి లాంఛనాన్ని ముగించారు.. 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించిన లక్నో 18వ సీజన్లో అదిరే బోణీ కొట్టింది.
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సొంత మైదానంలో ఘోర పరాభవం. బ్యాటుతో విధ్వంసం సృష్టించే ఆటగాళ్లు ఈసారి చేతులెత్తేశారు. ట్రావిస్ హెడ్(47), అనికిత్ వర్మ(36)ల పోరాటంతో 190 పరుగులు చేసింది హైదరాబాద్. ఛేదనలో తన తొలి ఓవర్లోనే మహ్మద్ షమీ డేంజరస్ ఎడెన్ మర్క్రమ్(1)ను వెనక్కి పంపి బ్రేక్ ఇచ్చాడు. మిడాఫ్ దిశగా మర్క్రమ్ ఆడిన బంతిని అక్కడే కాచుకొని ఉన్న కమిన్స్ ఒడిసి పట్టుకున్నాడు. దాంతో, 4 పరుగుల వద్ద లక్నో మొదటి వికెట్ పడినా మిచెల్ మార్ష్(52), నికోలస్ పూరన్(70)లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.
సిమర్జీత్ సింగ్ వేసిన ఓవర్లో పూరన్ 3 సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించి అర్థ శతకంతో జట్టు విజయానికి బాటలు వేశాడు. పూరన్ ఔటయ్యాక మార్ష్ కెప్టెన్ రిషభ్ పంత్(15) ధాటిగా ఆడాడు. కానీ హర్షల్ పటేల్ వేసిన ఫుల్‌టాస్‌ను అంచనావేయలేక వెనుదిరిగాడు. అప్పటికీ లక్నో విజయానికి26 పరుగులు అవసరం కాగా.. అబ్దుల్ సమద్(22 నాటౌట్) 4, 6 బాదాడు. జంపాను టార్గెట్ చేస్తూ 6, 4 కొట్టాడు. డేవిడ్ మిల్లర్(13 నాటౌట్).. విజయం ఖాతాలో వేసుకుంది.