IPL 2025 : ఐపీఎల్ రికార్డు బ్రేకర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో మ్యాచ్‌లోనూ భారీ స్కోర్ చేసింది. తమ సొంత ఇలాకాలో అభిమానులు అనుకున్నట్టుగా 200 ప్లస్ మాత్రం కొట్టలేదు కానీ, ప్రత్యర్థి లక్నో సూపర్ జెయింట్స్‌కు పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించింది. శుభారంభం దక్కకపోయినా ఓపెనర్ ట్రావిస్ హెడ్(47), నితీశ్ కుమార్ రెడ్డి(32)లు దూకుడుగా ఆడారు. కుర్రాడు అనికిత్ వర్మ(36)మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. ఆఖర్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్(18) హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దాంతో. నిర్ణీత హైదరాబాద్ ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేయగలిగింది.
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ బ్యాటింగ్ అప్పగించాడు. దాంతో, మరోసారి ఉప్పల్ మైదానంలో పరుగుల వరద ఖాయమనుకున్నారు అభిమానులు. కానీ, వాళ్ల అంచనాలు తప్పాయి. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను ఉతికారేసిన హైదరాబాద్ బ్యాటర్లకు లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు కట్టడి చేశారు. పేసర్ ఆదిలోనే శార్థూల్ ఠాకూర్ కమిన్స్ సేనుకు పెద్ద షాకిచ్చాడు. తన రెండో ఓవర్.. వరుస బంతుల్లో ఓపెనర్ అభిషేక్ శర్మ(6), సెంచరీ హీరో ఇషాన్ కిషన్(11)లను వెనక్కి పంపాడు.
3⃣6⃣ runs
5⃣ massive sixes 🔥Aniket Verma’s explosive cameo gave #SRH the much-needed late flourish 🧡
Updates ▶ https://t.co/X6vyVEvxwz#TATAIPL | #SRHvLSG | @SunRisers pic.twitter.com/21gh3f2jZR
— IndianPremierLeague (@IPL) March 27, 2025
15 పరుగులకే రెండు వికెట్లు పడగా.. ఓపెనర్ ట్రావిస్ హెడ్(47), నితీశ్‌తో కలిసి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఏమాత్రం ఒత్తిడి లోనవ్వకుండా తనదైన శైలిలో బౌండరీలతో స్కోర్ వేగం పెంచాడు. అయితే.. ప్రిన్స్ ఓవర్లో పెద్ద షాట్‌కు యత్నించి హెడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 76 పరుగులకే మూడు వికెట్లు పడిన దశలో హెన్రిచ్ క్లాసెన్(26), నితీశ్‌లు సమయోచితంగా ఆడారు. కానీ, ప్రిన్స్ యాదవ్ త్రోతో క్లాసెన్ రనౌట్ కావడంతో లక్నో ఊపిరి పీల్చుకుంది.
కొత్త కుర్రాడు అనికిత్ వర్మ(36) ఉన్నంత సేపు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పవర్ఫుల్ షాట్లు ఆడుతూ .. 13 బంతుల్లోనే 5 సిక్సర్లు బాదిన ఈ యువకెరటం జట్టు స్కోర్ 150 దాటించాడు. అయితే.. అభినవ్ మనోహర్(2, అతడు.. వరుసగా పెవిలియన్ చేరగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్(18) ధనాధన్ ఆడాడు. శార్దూల్ ఠాకూర్ ఓవర్లో ఆఖరి రెండు బంతుల్ని స్టాండ్స్‌లోకి పంపిన ప్యాటీ.. అవేశ్ ఖాన్‌కు సిక్సర్‌తో స్వాగతం పలికాడు. ఆ తర్వాత పాయింట్లో బౌండరీ కొట్టే ప్రయత్నంలో దిగ్వేశ్ చేతికి చిక్కాడు. అంతే.. ఆ తర్వాత హైదరాబాద్ 200 లోపే పరిమితమైంది.
Innings Break!
1⃣9⃣1⃣ is what #LSG need to get their first 𝐖 of #TATAIPL 2025!
Can #SRH defend this total? 🤔
Updates ▶ https://t.co/X6vyVEuZH1#TATAIPL | #SRHvLSG | @SunRisers | @LucknowIPL pic.twitter.com/4gcVjkRgL2
— IndianPremierLeague (@IPL) March 27, 2025